In charge VCs AP: యూనివర్సిటీలకు ఇన్‌చార్జ్‌ వీసీల నియమ‌కం.. 17 వర్సిటీలకు ఇన్‌చార్జ్‌ వీసీలు వీరే..

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 17 యూనివర్సిటీలకు ఇన్‌చార్జ్‌ వైస్‌ చాన్సలర్ల(వీసీల)ను నియమి­స్తూ రాష్ట్ర ప్రభుత్వం జూలై 18న‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని యూనివర్సిటీల వీసీలపై తీవ్రస్థాయిలో రాజకీయ ఒత్తిళ్లు వచ్చాయి. బలవంతంగా రాజీనామాలు చేయించారనే ఆరోపణలు బలంగా వినిపించాయి.

17 వర్సిటీలకు ఇన్‌చార్జ్‌ వీసీలు వీరే

  1. ఎస్‌వీయూ ఇన్‌ఛార్జ్ వీసీగా చిప్పాడ అప్పారావు
  2. ఎస్‌కేయూ ఇన్‌ఛార్జ్ వీసీగా బీ. అనిత
  3. ఏయూ ఇన్‌ఛార్జ్ వీసీగా గొట్టపు శశిభూషణ్‌రావు
  4. నాగార్జున వర్సిటీ వీసీగా కంచర్ల గంగాధర్‌
  5. జేఎన్‌టీయూ అనంతపురం ఇన్‌ఛార్జ్ వీసీగా సుదర్శన్‌రావు
  6. పద్మావతి మహిళా వర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా వీ. ఉమ
  7. జేఎన్‌టీయూ విజయనగరం ఇన్‌ఛార్జ్ వీసీగా రాజ్యలక్ష్మీ
  8. జేఎన్‌టీయూ కాకినాడ ఇన్‌ఛార్జ్ వీసీగా మురళీకృష్ణ
  9. నన్నయ వర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా వై.శ్రీనివాసరావు
  10. విక్రమ సింహపురి వర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా సారంగం విజయభాస్కర్‌రావు
  11. కృష్ణా వర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా ఆర్‌.శ్రీనివాస్‌రావు
  12. రాయలసీమ వర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా ఎన్‌టీకే నాయక్‌
  13. ద్రవిడ వర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా ఎం.దొరస్వామి
  14. ఆర్కిటెక్చర్‌, ఫైన్‌ఆర్ట్స్‌ వర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా విశ్వనాథకుమార్‌
  15. ఆంధ్ర కేసరి వర్సిటీ (ఒంగోలు) ఇన్‌ఛార్జ్ వీసీగా డీవీఆర్ మూర్తి
  16. అబ్దుల్ హక్‌ ఉర్దూ వర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా పఠాన్‌ షేక్‌ ఖాన్‌
  17. యోగి వేమన వర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా కె.కృష్ణారెడ్డి 

యూనివర్సిటీల్లో టీఎన్‌ఎస్‌ఎఫ్, కూటమి అనుకూల ఉద్యోగులు వీసీలను బెదిరిస్తూ.. రాజీనామాలు చేసి వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేశారు. దీంతో జూలై 2 నాటికే వీసీలంతా రాజీనామాలు చేశారు.

ఈ రాజీనామాలను గవర్నర్‌ ఆమోదించడంతో తాజాగా ఆయా వర్సిటీలకు ఇన్‌చార్జ్‌ వీసీలను నియమిస్తూ ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్‌ ఉత్తర్వులిచ్చారు.

చదవండి: 

New Course: ‘మహీంద్ర’లో కొత్త కోర్సు

M Tech Admissions: హెచ్‌సీయూలో ఎంటెక్‌ స్పాట్‌ రౌండ్‌ అడ్మిషన్లు

#Tags