PM Vidyalakshmi Scheme: కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం.. పీఎం-విద్యాలక్ష్మి పథకానికి ఆమోదం

ఢిల్లీ, సాక్షి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం- విద్యాలక్ష్మి పథకంతో పాటు పలు అంశాలకు ఆమోదం తెలిపింది. డబ్బు లేని కారణంగా ప్రతిభావంతులైన విద్యార్థులు చదువుకు దూరం కావద్దనే పీఎం- విద్యాలక్ష్మి పథక లక్ష్యం. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు పీఎం-విద్యాలక్ష్మి ద్వారా ఆర్థికంగా లబ్ధి చేకూరనుంది.

నాణ్యత కలిగిన 860 ఉన్నత విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు  ప్రభుత్వం రుణ సౌకర్యం కల్పించనుంది.  రూ. ఏడున్నర లక్షల  వరకు రుణ సౌకర్యం అందించనుంది.

చదవండి: Scholarship Program: పీఎం స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం.. ఈ సర్టిఫికేట్స్‌ తప్పనిసరి

ఈ పథకం ద్వారా 75 శాతం క్రెడిట్ గ్యారెంటీని కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది. పీఎం-విద్యాలక్ష్మి ద్వారా ఏటా 22 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి పొందనున్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

#Tags