GNM Nursing Courses: జీఎన్‌ఎం కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు

నల్లగొండ టూటౌన్‌ : రాష్ట్రంలోని ప్రభుత్వ, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌, ప్రైవేట్‌ జీఎన్‌ఎం (జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌ వైఫరీ) శిక్షణ సంస్థల్లో జీఎన్‌ఎం ట్రైనింగ్‌ కోర్సులో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పుట్ల శ్రీనివాస్‌ అక్టోబర్ 16న ఒక ప్రకటనలో తెలిపారు.

2024–25 సంవత్సరానికి గాను ఆసక్తి గల అభ్యర్థులు జిల్లాలోని గుర్తింపు శిక్షణ సంస్థలు, సంబంధిత ప్రిన్సిపాల్స్‌, జీఎన్‌ఎం కాలేజీ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలను dme.telangana.gov.in లో పొందు పర్చినట్లు తెలిపారు. ఆసక్తి గలవారు అక్టోబర్ 17లోగా ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

చదవండి: MBBS 2024 Seats: కొత్త మెడికల్‌ కాలేజీ ..... 150 ఎంబీబీఎస్‌ సీట్లు

వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

కేతేపల్లి : ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ కాన్పులను పెంచాలని, సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శ్రీనివాస్‌ వైద్యులకు సూచించారు. అక్టోబర్ 16న కేతేపల్లి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం ప్రజా ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాల తీరును వైద్యసిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటి డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, వైద్యాధికారి అర్చన పాల్గొన్నారు.
 

#Tags