AP Schools Fee Increased 2024 : జూన్ 13వ తేదీ నుంచి స్కూల్స్ ప్రారంభం.. భారీగా పెరిగిన స్కూల్‌ ఫీజులు ఇలా..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్కూల్స్ జూన్ 13వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. పిల్లల స్కూల్‌ చదువులకు ఖర్చులు ఏటికేడాది విపరీతంగా పెరుగుతున్నాయి. కుటుంబం నుంచి బాలుడు, బాలికను ప్రైవేట్‌ పాఠశాలలకు పంపాలంటే ఫీజులు, దుస్తులు, షూస్‌, పుస్తకాలు, బ్యాగులు, ఇతర సామగ్రితో పాటు రవాణా చార్జీలకు రూ.వేలల్లో చెల్లించాల్సి వస్తోంది.

గతేడాదితో పోలిస్తే ఈసారి పుస్తకాలు, పెన్నులు, నోట్‌బుక్‌ల తదితర వాటిపై 10 శాతం ధరలు పెరిగాయి. ఎల్‌కేజీ నుంచి 10వ తరగతి వరకూ వేలల్లో ఫీజులు కట్టాల్సి వస్తోంది. ఇక హస్టల్‌ ఉంటే అదనపు బాదుడు తప్పడం లేదు. ఇక కళాశాల, ఇంజనీరింగ్‌ చూస్తే లక్షల్లోనే ఖర్చు పెట్టక తప్పదు. ఇందుకోసం ఎక్కువ మంది తల్లిదండ్రులు అప్పులకు సిద్ధమవుతున్నారు.

☛ AP Schools Summer Holidays Extended 2024 : ఏపీలో స్కూల్స్‌కు వేస‌వి సెల‌వులు పొడిగింపు.. కార‌ణం ఇదే.! మొత్తం ఎన్ని రోజులంటే..?

స్కూళ్ల నుంచి ఒత్తిడి మొదలైంది.. :  – లలితమ్మ, చిలమత్తూరు
మాకు ఇద్దరు పిల్లలు. హిందూపురంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నాను. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమ్మఒడి ద్వారా అందించే రూ.15 వేలకు తోడు కొంత నగదు చేతి నుంచి వేసుకుని పిల్లలను చదివించే వాళ్లం. ప్రభుత్వం మారడంతో ఇప్పుడు సకాలంలో పిల్లలకు ఫీజు చెల్లిస్తారా? లేదా? అన్న భయం ఉంది. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి రూ.15 వేలు ఇస్తామన్నారు. ఆ డబ్బులు ఎన్నడిస్తారో చూడాలి మరి. స్కూళ్ల నుంచి మాత్రం అప్పుడే ఫీజు గురించి ఒత్తిడి మొదలైంది.

#Tags