APSCHE: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 'AI' కోర్సులు

విజయవాడ సెంట్రల్: వచ్చే విద్యాసం వత్సరం నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) కోర్సులు ప్రారంభిం చనున్నట్లు ఉన్నత విద్య కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్ తెలిపారు.

స్థానిక మాచవరం ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జ‌నవ‌రి 9న‌ రాష్ట్రంలోని 54 ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ప్రిన్సిపాల్స్, ఇంటర్నల్ క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ సమన్వయకర్తల శిక్షణ కార్యక్రమం జరిగింది. కార్యక్ర మంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ప్రతి కళాశాల ప్రిన్సిపాల్ స్థానికంగా ఉన్న పరిశ్రమలతో ఒప్పందం చేసుకుని విద్యార్థులకు ఇంట రేప్ చేయించాలని సూచించారు. అలాగే డిగ్రీ పూర్తయ్యేలోపు ప్రతి ఒక్కరికీ ఉపాధి లభించేలా విద్యార్థు లను తీర్చిదిద్దాలన్నారు.

చదవండి: Artificial Intelligence: కృత్రిమ మేధతో నవ ప్రపంచం?

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆగ్యుమెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియా లిటీని ఉపయోగించుకుని విద్యాబోధన మరింత సరళ తరం చేయాలన్నారు.

అనంతరం అమెరికాకు చెందిన జెడ్ స్పేస్ టెక్నాలజీ వారు రూపొందించిన 3డీ వీడియోలను ప్రదర్శించారు. జంతు, వృక్ష, రసాయన, భౌతిక శాస్త్రాలకు సంబంధించిన వివిధ 3డీ వీడియో లను ఆగ్యుమెంటెడ్ రియాలిటీ ప్రజెంటేషన్ ను ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ గౌతం మేందు అందించారు.

#Tags