Admissions: బీసీ హాస్టల్‌లో ప్రవేశాలు

పెద్దపల్లి రూరల్‌: పట్టణ శివారు రంగంపల్లిలోని బీ సీ బాలుర వసతి గృహంలో ప్రవేశాల కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు సంక్షేమ అధికారి రమేశ్‌ జూన్ 12న‌ ఒక ప్రకటనలో తెలిపారు. మూడు నుంచి పదో తరగతి వరకు చదివే వారు అర్హులన్నారు.

మొత్తం 56 సీట్లు ఖాళీగా ఉన్నాయని వివరించారు. అందులో బీసీలకు 47, ఎస్సీలకు 4, ఎస్టీలకు 2, ఓసీలకు 3 సీట్లు కేటా యించారని పేర్కొన్నారు. దరఖాస్తుతోపాటు కులం, నివాసం, ఆదాయ ధ్రువీకరణపత్రాలు, టీసీ, స్టడీసర్టిఫికెట్లు, ప్రోగ్రెస్‌కార్డు, ఆధార్‌కార్డు, మూడు పాస్‌పోర్టుసైజ్‌ ఫొటోలతో హాజరు కావాలని కోరారు. వివరాలకు 79894 54154, 70937 72827 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

చదవండి:

Supreme Court Order: ‘సేవా లోపం’ పేరుతో లాయర్లపై కేసు వేయలేరు: సుప్రీంకోర్టు 

#Tags