Guinness World Record: గిన్నిస్‌ రికార్డుల్లోకి.. 4వ తరగతి విద్యార్థి

మియాపూర్‌: పిట్ట కొంచెం కూత ఘనమని నాల్గో తరగతి విద్యార్థి నిరూపించాడు. మియాపూర్‌ మదీనాగూడలోని కెనరీ పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్న తమ్మన సాయి విహాన్‌ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు.

విమానాలపై తోకభాగంలో ఉండే లోగోల ద్వారా విమానాల పేర్లను అనర్గళంగా చెప్పడంలో విజయం సాధించాడు. ఒక్క నిమిషంలో 79 విమానాల లోగోలను గుర్తించి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు.

చదవండి: World Record: ప్రపంచ రికార్డు నెలకొల్పిన భార‌త బాలిక‌!!

రికార్డు సాధించడం పట్ల తల్లిదండ్రులు తమ్మన వెంకట నాగ సత్య శివ శ్రీచరణ్, ప్రియాంకతో పాటు తరగతి ఉపాధ్యాయురాలు రుచి సత్యవాది ప్రోత్సాహం అందించారని విహాన్‌ చెప్పారు. ఇటీవల గిన్నిస్‌ రికార్డు సర్టిఫికెట్‌ అందుకున్న విహాన్‌ను ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అభినందించారు. విహాన్‌ రికార్డు సాధించడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

#Tags