3 Days Holidays For Schools and Colleges : సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో.. స్కూల్స్, కాలేజీలకు సెలవులు.. ఆఫీసులకు కూడా..
సెప్టెంబర్ నెలలో నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం, శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సెలవులు ఉన్నాయి.
వరుసగా మూడు రోజులు పాటు.. సెలవులు..
ఇప్పుడు తాజాగా ఢిల్లీలో సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో జీ-20 సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం స్కూల్స్, కాలేజీలు సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో సెలవులను ప్రకటించారు. అలాగే ప్రైవేట్ కార్యాలయాలకు కూడా సెలవులు ఇచ్చారు.
ఆ పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల..
ఐరోపా దేశాల తోపాటు 19 ఇతర దేశాలు పాల్గొనే ఈ సదస్సుకు ఈసారి భారతదేశం ఆతిధ్యమివ్వనుంది. ఢిల్లీ వేదికగా భారత్ మండపం కన్వెన్షన్ సెంటర్‌లో సెప్టెంబర్ 8-10 వరకు జరిగే ఈ సమావేశాలకు ఆయా దేశాల ప్రతినిధులు హాజరుకానున్న నేపధ్యంలో ఆ పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపుల తోపాటు కొన్ని టాఫిక్ ఆంక్షలు కూడా విధించనున్నట్లు తెలిపారు ఢిల్లీ ట్రాఫిక్ కమీషనర్ ఎస్ఎస్ యాదవ్.
చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్
ఈ మూడు రోజులు ప్రజలు..
ఈ ఆంక్షలు సెప్టెంబర్ 7 సాయంత్రం మొదలై సెప్టెంబర్ 10 వరకు కొనసాగుతాయని ఢిల్లీ వాస్తవ్యులైతే పర్వాలేదు కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారైతే తప్పక తమ హోటల్ బుకింగ్ సమాచారాన్ని చూపించాల్సి ఉంటుందని అన్నారు. రవాణాకు సంబంధించి అంబులెన్స్ లాంటి అత్యవసర వాహనాలపై ఎలాంటి ఆంక్షలు లేవు కానీ కార్గో ట్రక్కులను, నగరం బయటే నిలిపివేస్తామని, డీటీసీ సేవలు కూడా అందుబాటులో ఉండవని..మెట్రో సేవలు మాత్రమే అందుబాటులోనే ఉంటాయని ప్రయాణికులు మెట్రో ద్వారా ప్రయాణించాలని కోరారు. ఈ మూడు రోజులు ప్రజలు రద్దీగా ఉండే మార్కెట్‌లకు వెళ్లవద్దనీ ఏమి కావాలన్నా ముందే తెచ్చి పెట్టుకోవాలని అన్నారు.
మథుర రోడ్, బైరాన్ మార్గ్, పురానా ఖిలా రోడ్‌లలో పూర్తిగా ట్రాఫిక్ నిలిపివేస్తున్నట్లు తెలుపుతూ ఎయిర్‌పోర్టుకు రైల్వే స్టేషన్లకు వెళ్లాల్సిన వారు ముందుగానే వెళ్లాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వర్చువల్ హెల్ప్ డెస్క్ సేవలు కూడా వినియోగించుకోవాలని తెలిపారు.
సెప్టెంబర్ నెలలో సెలవుల పూర్తి వివరాలు ఇవే..
☛ సెప్టెంబర్ 3- ఆదివారం
☛ సెప్టెంబర్ 7- శ్రీకృష్ణ జన్మాష్టమి
☛ సెప్టెంబర్ 9- రెండో శనివారం
☛ సెప్టెంబర్ 10- ఆదివారం
☛ సెప్టెంబర్ 17- ఆదివారం
☛ సెప్టెంబర్ 18- వినాయక చవితి
☛ సెప్టెంబర్ 23- నాలుగో శనివారం
☛ సెప్టెంబర్ 24- ఆదివారం
☛ సెప్టెంబర్ 28- మిలాద్ ఉన్ నబీ
చదవండి: టిఎస్ ఇంటర్ - ఇంటర్ | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్