Tenth Class Public Exams 2024: పదిలో ఉత్తమ మార్కుల కోసం ప్రణాళికతో సాధన చేస్తే వందకు వంద మార్కులు సాధ్యం

పదిలో ఉత్తమ మార్కుల కోసం ప్రణాళికతో సాధన చేస్తే వందకు వంద మార్కులు సాధ్యం
Tenth Class Public Exams 2024: పదిలో ఉత్తమ మార్కుల కోసం ప్రణాళికతో సాధన చేస్తే వందకు వంద మార్కులు సాధ్యం

రామభద్రపురం: పదో తరగతి ప్రతి విద్యార్థి జీవితంలో ఎంతో కీలకం. పదిలో సాధించిన మార్కులే ఉన్నత విద్య, ఉద్యోగాల కోణంలో ప్రతి దశలోనూ పరిగణనలోకి తీసుకుంటున్నారు.అందుకోసం విద్యార్థులు మార్చి 18 నుంచి జరగబోయే పబ్లిక్‌ పరీక్షల్లో అత్యధిక మార్కుల సాధనపై దృష్టిపెట్టాలి. ఈ నేపథ్యంలో ప్రతి సబ్జెకుకు సంబంధించి సిలబస్‌ను, పరీక్ష విధానాన్ని అవగాహన చేసుకుని పటిష్టమైన ప్రిపరేషన్‌కు ప్రణాళిక రూపొందించుకోవాలి. జిల్లాలో సుమారు 27 వేల మందికి పైబడి విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలతో పాటు ఇతర విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. దాదాపు అన్ని పాఠశాలల్లో ఇప్పటికే సిలబస్‌ పూర్తిచేసి ఉత్తమ ఫలితాలు సాధించాలన్న లక్ష్యంతో ఉపాధ్యాయులు కృషిచేస్తున్నారు. విద్యాలయాలు వందశాతం ఉత్తీర్ణత సాధించాలంటే ఉపాధ్యాయులు, పర్యవేక్షణ అధికారులు అదే స్థాయిలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుందని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థులు ఇప్పటి నుంచే ప్రణాళికతో ముందడుగు వేయాల్సి ఉందని పలువురు సబ్జెక్టు నిపుణులు తెలియజే స్తున్నారు.

#Tags