UPSC Civils Ranker Tharun Patnaik Story : ఎలాంటి కోచింగ్ లేకుండానే.. వ‌రుస‌గా రెండు సార్లు సివిల్స్ కొట్టానిలా..

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిషన్(UPSC) నిర్వ‌హించే సివిల్స్ ఒక్క‌సారి కొట్టాలంటేనే.. చాలా క‌ష్టంగా ఉంటుంది. కానీ యువ‌కుడు వ‌రుస‌గా రెండు సార్లు సివిల్స్‌ సాధించి.. ఏకం ఐఏఎస్ ఉద్యోగానికి ఎంపిక‌య్యాడు.
UPSC Civils Ranker Tharun Patnaik Story

పట్టుదల, ప్రణాళిక ఉంటే ఏదైనా సాధించవచ్చునని నిరూపించాడు ఈ యువ‌కుడు. ఈయ‌నే రాజమహేంద్రవరంకు చెందిన తరుణ్‌ పట్నాయక్‌. ఈ నేప‌థ్యంలో తరుణ్‌ పట్నాయక్ స‌క్సెస్ స్టోరీ మీకోసం..

కుటుంబ నేప‌థ్యం :

తరుణ్‌ పట్నాయక్‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రాజమహేంద్రవరం మోడల్‌ కాలనీకి చెందిన వారు. తండ్రి రవికుమార్‌ పట్నాయక్‌. ఈయ‌న ఎల్‌ఐసీ రాజమహేంద్రవరం రూరల్‌ బ్రాంచిలో క్లర్క్‌గా పనిచేస్తున్నారు. తల్లి శారదా రాజ్యలక్ష్మి పట్నాయక్‌., ఈమె గృహిణి. వీరికి తరుణ్‌ పట్నాయక్‌ ఏకైక సంతానం. చిన్నతనం నుంచే అతను ఏ లక్ష్యం వైపు అడుగు వేసినా తల్లిదండ్రులు ప్రోత్సహించారు.

☛ APPSC : గ్రూప్‌-1 నోటిఫికేష‌న్ వ‌చ్చే నెల‌లోనే.. ఇంకా గ్రూప్‌–2 పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం.. మొత్తం..

ఎడ్యుకేష‌న్ : 

1999 జనవరి 12వ తేదీన జన్మించిన తరుణ్‌ పట్నాయక్‌ ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు జస్వర్‌ స్కూల్లోను, 6వ నుంచి 10వ తరగతి వరకు కేకేఆర్‌ గౌతమ్‌స్కూల్లో, ఇంటర్‌ శ్రీచైతన్యలోను, గౌహతిలో ఐఐటీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ 2020లో పూర్తిచేశాడు.చదువులో రాణిస్తూ..గౌహతి ఐఐటీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసి, కోచింగ్‌ సెంటర్లను ఆశ్రయించకుండా స్వశక్తితో పక్కా ప్రణాళికతో చదువుకున్నాడు. 

ఎలాంటి కోచింగ్ లేకుండానే..

కోచింగ్‌ సెంటర్లను ఆశ్రయించకుండా సివిల్స్‌ స్వయంశక్తితో చదివాడు. గంటల తరబడి కాకుండా సిలబస్‌ ప్రకారం చదవడంతో పాటు ప్రాక్టీస్‌ చేసేవాడు. 2021 సివిల్స్‌ తుది ఫలితాల్లో 99వ ర్యాంకు సాధించి సిమ్లాలోని ఇండియన్‌ ఆడిట్‌ అండ్‌ అకౌంట్‌లో ట్రైనింగ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడితో ఆగకుండా మళ్లీ తన లక్ష్యాన్ని సాధించేందుకు 2022 సివిల్స్‌కు మరింతగా కష్టపడి చదవడంతో పాటు ప్రాక్టీస్‌ చేయడంతో తుదిఫలితాల్లో 33వర్యాంకు సాధించి తన ఐఏఎస్‌ కలను సాకారం చేసుకున్నాడు.

☛ Young IAS Success Story: తొలి ప్ర‌య‌త్నంలోనే ఐఏఎస్ కు ఎంపికైన 22ఏళ్ళ యువ‌కుడు....కార‌ణం?

తరుణ్‌ పట్నాయక్‌.. తొలి ప్రయత్నంలో సివిల్స్‌లో 99వ ర్యాంకు సాధించి ఉద్యోగం పొందినా దాంతో సంతృప్తి పడకుండా రెండోసారి పట్టుదలగా ప్రయత్నించి 33వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌గా తన కలను సాకారం చేసుకున్నాడు. సామాన్య మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పాఠశాల స్థాయి నుంచి రాణిస్తూ ఐఏఎస్‌కు ఎంపికయ్యాడు.

సిలబస్‌ ప్రకారం ఇలా చదివా...

గంటల తరబడి కాకుండా సిలబస్‌ను డివైడ్‌ చేసుకుని చదివాను. చదవడంతోపాటు ప్రాక్టీస్‌ ఎక్కువగా చేశాను. తొలివిడతలో ఆరు మార్కుల తేడాలో 99వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌ సాధించలేకపోయా. ఈసారి ఎలాగైనా ఐఏఎస్‌ సాధించాలన్న లక్ష్యంతో పక్కా ప్రణాళికతో చదవడంతో పాటు, ప్రాక్టీస్‌ చేయడంతో 33వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌ కావడం చాలా ఆనందంగా ఉంది. ఐఏఎస్‌ కావడానికి తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. సిలబస్‌ను ఇష్టపడి చదవడంతో పాటు, ప్రాక్టీస్‌ చేస్తే ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాన్ని సాధించవచ్చు. ఐఏఎస్‌ కావడంతో ప్రజలకు సేవచేసే అవకాశం దక్కింది.

☛ UPSC Civils Ranker Success Story : ఈ జంట సాధించిన విజ‌యంతో వారి ఇంట వేడుక‌లు రెట్టింపు..

నా కొడుకు ఐఏఎస్‌.. చాలా ఆనందంగా ఉంది..: రవికుమార్‌ పట్నాయక్‌, తరుణ్‌ తండ్రి
నా కుమారుడు తరుణ్‌ పట్నాయక్‌ సివిల్స్‌లో 33వ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది. అతి సామాన్య కుటుంబంలో నుంచి వచ్చిన నేను ఎల్‌ఐసీలో క్లర్క్‌గా పనిచేస్తూ కుమారుడిని చదివించా. తరుణ్‌ చిన్నతనం నుంచే ఐఐటీ చదివి ఐఏఎస్‌ కావాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నాడు. తన లక్ష్యాన్ని తల్లిదండ్రులుగా ప్రోత్సహించాం. తొలివిడతలో రాకపోయినా రెండో విడతలో ఐఏఎస్‌ సాధించడంతో మా సంతోషానికి అవధులు లేవు.

#Tags