UPSC Civil Ranker Success Story : చివ‌రికి సివిల్స్‌లో విజ‌యం సాధించానిలా.. కానీ..

మ‌నం అనుకున్న ల‌క్ష్యం సాధించాల‌నే.. పట్టుదల, తపన ఉంటే విజయం సాధించవచ్చని నిరూపించారు సివిల్‌ సర్వీస్‌ ర్యాంకర్‌ శ్రవణ్‌కుమార్‌రెడ్డి. ఒక‌టి కాదు.. రెండు కాదు. మూడు కాదు.. నాలుగుసార్లు సివిల్స్ ప‌రీక్ష రాసినా అనుకున్న ర్యాంకు సాధించలేకపోయారు.

చివ‌రికి ఐదో ప్రయత్నంలో సివిల్స్‌ ర్యాంక్‌ సాధించారు. ఈ నేప‌థ్యంలో సివిల్స్ ర్యాంక‌ర్ సీహెచ్‌ శ్రవణ్‌కుమార్‌రెడ్డి స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం..

కుటుంబ నేప‌థ్యం :
తెలంగాణ‌లోని షాద్‌నగర్‌ రేగోడి చిలకమర్రి ప్రాంతానికి చెందిన వారు సీహెచ్‌ శివకుమార్‌రెడ్డి. ఈయ‌న‌కు చిన్న‌త‌నం నుంచే సివిల్‌ సర్వీస్‌ సాధించాలనే లక్ష్యం ఉండేది. ప్రిలిమ్స్‌ సాధించి పరిస్థితులు అనుకూలించక మెయిన్స్‌ రాయలేకపోయారు. ఇండియన్‌ రైల్వేస్‌లో ట్రైన్‌ గార్డుగా ఉద్యోగ, కుటుంబ బాధ్యతలతో సివిల్స్‌ లక్ష్యం నెరవేరలేదు. దీంతో తండ్రి కలను తాను నెరవేర్చాలనుకన్నాడు కుమారుడు శ్రవణ్‌కుమార్‌రెడ్డి. ఐఐటీ బాంబేలో చదివారు. మ్యాథమెటిక్స్‌ ఆప్షనల్స్‌తో సివిల్స్‌ రాశారు.

➤ UPSC Civils Ranker Success Story : ఫెయిలైనా.. ప‌ట్టిన‌ పట్టు వీడలేదు.. చివ‌రికి..

ఎలాంటి కోచింగ్‌ తీసుకోకుండానే..
శ్రవణ్‌కుమార్ సివిల్స్ కోసం ఎక్కడా కోచింగ్‌ తీసుకోలేదు. రోజూ 8-10 గంటలు చదివారు. విచక్షణతో చదువుతూ, విషయాలపై అవగాహన పెంచుకుంటూ చదివారు. తన మిత్రుడు ప్రణవ్‌తో కలిసి చదవడం ఉపయోగపడింది. అవసరమైన అంశాలపై యూట్యూబ్‌, ఇంటర్నెట్‌ను ఫాలో అవుతూ ప్రతిరోజూ న్యూస్‌ పేపర్లు చదివారు.

నా స‌ల‌హా.. :
కష్టపడి చదవుతూ ఎక్కువగా సమయం కేటాయించాలి. మెంటర్స్‌ తప్పనిసరిగా ఉండాలి. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలే ప్రామాణికంగా చదవాలి. ఇష్టమైన సబ్జెక్టులనే ఆప్షనల్స్‌గా తీసుకోవాలి.

ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్న‌లు ఇవే..
యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) చైర్మన్‌ మనోజ్‌ సోని బృందం శ్రవణ్‌కుమార్‌రెడ్డిని ఇంటర్వ్యూ చేసింది. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం గురించి చెప్పమన్నారు. తెలంగాణలో ఇరిగేషన్‌, హరితహారం, పవర్‌ ప్రాజెక్టులపై అడిగారు.

☛ Inspiration Story: భ‌ర్త కానిస్టేబుల్‌.. భార్య‌ ఐపీఎస్‌.. 10వ తరగతి కూడా చదవని భార్య‌ను..

#Tags