Shweta Teotia,IAS : సివిల్స్‌కు కోచింగ్‌కు ఎక్కడా వెళ్లలేదు...ఈజీగానే ఐఏఎస్ సాధించానిలా..

‘నేను 1 నుంచి 10వ తరగతి వరకు మీరట్‌లో సోఫియా గర్ల్స్‌ హైస్కూలులో చదివాను. తర్వాత ముంబయి సెయింట్‌ జెలిబిస్‌ కళాశాలలో చదివాను.
Shweta Teotia IAS

డిగ్రీలో ఇంగ్లీషు లిటరేచర్‌ చేశాను. అందుకే ఐఏఎస్‌ ఈజీగా సాధించగలిగాను.

కుటుంబ నేప‌థ్యం :


అమ్మ అనూరాధ, నాన్న కన్నల్‌ డీఎస్‌ తెవతీయ. నాకు ఒక సోదరుడు ఉన్నారు. ఆయన అమెరికాలో చదువుతున్నాడు. ఇద్దరు సోదరీమణుల్లో ఒకరు టీచర్‌గా పనిచేస్తుండగా, మరొకరు ఎంబీఏ చేస్తున్నారు.

జాయింట్‌ కలెక్టర్‌గా...
జాయింట్‌ కలెక్టర్‌గా ఇక్కడి ప్రజలతో మమేకమవడం.. వారి సమస్యలు తెలుసుకోవడం.. పరిష్కరించడాన్ని దేవుడిచ్చిన గొప్ప బాధ్యతగా స్వీకరిస్తున్నా. రేషన్‌ షాపుల్లో అవినీతికి చెక్‌ పెడుతున్నాం. రేషన్‌ వినియోగదారులు ఏ ప్రాంతం నుంచైనా సరుకులు తీసుకోవచ్చు. కడపలో సరుకులు తీసుకోవడం కుదరలేదు. అలాంటపుడు రైల్వేకోడూరులోనే తీసుకోవచ్చు. ఇదే పోర్టబులిటీ సిస్టమ్‌. తద్వారా అవినీతికి చెక్‌ పడుతుంది. ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలి.

ఇవి అంటే నాకు చాలా ఇష్టం..
ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చాక అన్ని రకాల వంటలను చూశాను. పప్పు, గోంగూర, చికెన్, మటన్, సాంబారు, రసం లాంటి వంటలంటే చాలా ఇష్టం. అందుకే ఇటీవల వంటలు చేయడం నేర్చుకున్నాను. శని, ఆదివారాల్లో ఇంటిలో నేను వంటలు చేస్తుంటాను. స్పోర్ట్స్‌ స్కూలుకు వెళ్లి చిన్నారులతో ఎక్కువగా గడుపుతుంటాను. అక్కడ చుట్టూ కొండలు, పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకర వాతావరణ పరిస్థితులున్నాయి. అక్కడి విద్యార్థులతో వాకింగ్‌ చేయడంతోపాటు వారి కష్టసుఖాలు తెలుసుకుంటాను. ఎక్కువగా పేపరుతోపాటు పుస్తకాలు చదవడం అలవాటు. ఖాళీ దొరికితే నవలలు చదువుతూ కాలక్షేపం చేస్తాను. కాకపోతే బిజీ వల్ల కుదరడం లేదు. ఏదో ఒక టైమ్‌లో కొద్దిసేపైనా చదవడం అలవాటు.’ అని జేసీ సాక్షికి వివరించారు.

జర్నలిస్టుగా...
చదువు పూర్తి కాగానే ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికలో జర్నలిస్టుగా జాయిన్‌ అయ్యాను. ముంబయిలో ఎన్నో ఫీచర్స్‌ రాశాను. కథనాలకు అద్భుతమైన ఫలితాలు రావడం మరిచిపోలేని అనుభూతి. ప్రతిరోజు కొత్తకొత్త అంశాలతో.. అభిరుచులతో అందంగా పేజీకి ఫీచర్స్‌ అందించేదాన్ని.

ఎక్కడా కోచింగ్‌కు వెళ్లలేదు...
జర్నలిస్టుగా పనిచేసినంతరం ఐఏఎస్‌కు ప్రిపేర్‌ అయ్యాను. ఎక్కడా కోచింగ్‌కు వెళ్లలేదు. సొంతంగానే ఒక పద్ధతి ప్రకారం చదివి సాధించాను. ఇంగ్లీషు లిటరేచర్‌ కాబట్టి ఈజీగా సాధించాను. 2011లో సెలెక్ట్‌ అయి మొదటగా చిత్తూరులో శిక్షణ పొంది, తర్వాత విశాఖ పరిధిలోని నర్సీపట్నం, ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఓఎస్‌డీగా పనిచేసిన తర్వాత కడప జాయింట్‌ కలెక్టర్‌గా ప‌నిచేశాను.

Manu Chowdary, IAS : అమ్మ కోసం..తొలి ప్రయత్నంలోనే

IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్‌ టూ 'ఐఏఎస్‌'..సెలవుల్లో పొలం పనులే...

Success Story: తొలి ప్రయత్నంలోనే..ఎలాంటి కోచింగ్‌ లేకుండా..22 ఏళ్లకే సివిల్స్‌..

Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్‌ వైపు..నా స‌క్సెస్‌కు కార‌ణం వీరే..

IAS Officer, IAS : నిత్యం పాలమ్మితే వ‌చ్చే పైసలతోనే ఐఏఎస్‌ చ‌దివా..ఈ మూడు పాటిస్తే విజయం మీదే :యువ ఐఏఎస్‌ డాక్టర్‌ బి.గోపి

Veditha Reddy, IAS : ఈ సమస్యలే న‌న్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌...

Surya Sai Praveen Chand,IAS : అమ్మ చెప్పిన ఈ మాట కోసమే ఐఏఎస్ సాధించా..

#Tags