Krishna Teja, IAS: ఈ క‌సితోనే ఐఏఎస్ అయ్యాడు... ప్ర‌జ‌ల మ‌న‌స్సుల‌ను గెలిచాడు

మైలవరపు కృష్ణ తేజ, ఐఏఎస్

➤ నాలోని లోపాల‌ను శ‌త్ర‌వుల ద్వారా తెలుసుకున్నానిలా..
➤ నేను న‌మ్మిన ఫిలాస‌ఫీ ఇదే..
➤ నాకు స్ఫూర్తి, ప్రోత్సాహం వీరే...
➤ ఈ స‌బెక్ట్‌లో ఆల్ ఇండియా టాప‌ర్‌ని..

ఒక్కోసారి ఏళ్ల తరబడి ప్రిపరేషన్ కొనసాగించాల్సి వస్తుంది. ఈ క్రమంలో మూడు సార్లు మధ్యలోనే అపజయం ఎదురైనా పట్టుదలతో నాలుగో ప్రయత్నంలో 66వ ర్యాంకును సొంతం చేసుకున్నారు గుంటూరుకు చెందిన మైలవరపు కృష్ణ తేజ. అలాగే కేర‌ళ‌లో అనేక విన్నూత సేవా కార్య‌క్ర‌మాల ద్వారా  చిన్న వ‌య‌స్సులోనే ప్ర‌జ‌ల మ‌న‌స్సు గెలుచుకున్నారు. ఫేస్‌బుక్‌లో " I Am For Alleppey " అనే పేజీని క్రియేట్ చేసి ఒక సంచలనం సృష్టించాడు. వెనుకబడిన తరగతుల అభ్యున్నతి, మహిళా సాధికారత, అందరికీ నాణ్యమైన విద్య లక్ష్యంగా దేశానికి తన వంతుగా సేవలు అందిస్తానంటున్న కృష్ణతేజ సక్సెస్ స్టోరీ ఆయన మాటల్లోనే.. 

కుటుంబ నేప‌థ్యం : 
మాది గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట. నాన్న శివానంద కుమార్ హోల్‌సేల్ వ్యాపారి. అమ్మ భువనేశ్వరి గృహిణి.

నా చ‌దువు : 
పదోతరగతి వరకు స్థానిక పాఠశాలలోనే విద్యనభ్యసించాను. గుంటూరులోని ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ పూర్తి చేశాను. నర్సారావుపేటలోని ఇంజనీరింగ్ కళాశాల నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నాను. నేను టెన్త్‌, ఇంట‌ర్‌, ఇంజ‌నీరింగ్‌లో టాప‌ర్‌ని. ఇంజ‌నీరింగ్ అయిపోగానే మంచి వేత‌నంతో కూడిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వ‌చ్చిన‌ప్పుటికి సంతోషం అన్పించ‌లేదు. 

ఈ ఇగోతోనే సివిల్స్ రాసా... కానీ
నా చిన్నప్పటి నుంచే నాకు సివిల్స్‌పై ఆసక్తి. దాంతో 2010లో సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించాను. దాని కోసమే హైదరాబాద్ వచ్చా. టెన్త్‌, ఇంట‌ర్‌, ఇంజ‌నీరింగ్‌లో టాప‌ర్‌ని క‌దా... అనే ఇగోతో సివిల్స్ రాశాను. మూడు సార్లు ఫెయిల్ అయ్యా. 

చివ‌రికి నా శ‌త్ర‌వుల ద్వారా... 
ఈ ఓట‌మిల‌తో నాలోని లోపాల‌ను స‌రిచేసుకోవ‌డం మొద‌లు పెట్టాను. కానీ నాలోని త‌ప్పులు నాకు ఏమి క‌న్పించ‌లేదు. చివ‌రికి నా స్నేహితుల‌తో నేను ఐఏఎస్ కావాల‌ని ఉంది రా... నాలోని లోపాల‌ను చెప్ప‌మ‌ని వాళ్ల‌ను అడిగా... వాళ్లు కూడా ఏవ‌రు ఏమి చెప్పింది లేదు. అంత బాగుంది క‌ద‌రా..బాగా చ‌దువుతావ్ కాదా..అన్నారే కానీ..నాలోని లోపాలు చెప్ప‌లేదు. ఇంక నేను ఫైన‌ల్‌గా ఒక నిర్ణ‌యానికి వ‌చ్చి..నా జాబ్‌కు తిరిగి వెళ్లి పోతానని మా ఫ్రెండ్స్‌కు చెప్పాను. ఈ విష‌యం నా శ‌త్ర‌వుల‌కు తెలిసింది. వాళ్ల‌కు ఎక్క‌డలేని ఆనందం. ఉదయాన్నే నా శ‌త్ర‌వులు నా రూమ్‌కు వ‌చ్చి నువ్వు చాలా మంచి నిర్ణ‌యం తీసుకున్నావ్ తేజ‌... Congratulations అని Wishes చెప్పారు. వాళ్లు నీకు ఐటీ జాబే క‌రెక్ట్ అన్నారు... ఎందుకంటే నీకు ఐఏఎస్ రాద‌న్నారు. నేను చాలా కోపంతో... స‌రే రా నాకు ఎందుకు ఐఏఎస్ రాదో చెప్పండి అన్నా? ఆ ముగ్గురు నాతో... తేజ ఐఏఎస్‌లో 2000 ప్ల‌స్ మార్కుల‌కు Written exam ఉంటుంది... నీ Hand writing అంత‌బాగోదు కాబ‌ట్టి అది నీ మొద‌టి కార‌ణం. నీవు రాసే ప‌రీక్ష‌లో పాయింట్ వైజ్ రాస్తావు... ఒక Flow ఉండ‌దు అన్నారు. ఇది రెండో కార‌ణం. మూడో కార‌ణం ఏమిటంటే... నీవు అడిగిన‌ దానికే స‌మాధానం చెప్పి... సైలెంట్‌గా ఉంటావన్నారు. వీళ్లు చెప్పిన మూడు నాలోని లోపాలు నిజ‌మే అన్పించింది. వీళ్లు చెప్పిన ఈ మూడు స‌మాధానాల వ‌ల్ల‌ నాకు చాలా సంతోషంగా అన్పించింది. చివ‌రికి నాకు తెలిసింది ఏమిటంటే... నాలో Positivity తెలియాలంటే నా ఫ్రెండ్స్‌ని అడ‌గాలి... నాలోని Negativity తెలియాలంటే నా శ‌త్ర‌వుల‌ను అడ‌గాల‌ని తెలుసుకున్నా. ఈ మూడు Mistakesల‌ను ఒక‌టిన్న‌ర ఏడాదిలోనే పూర్తి చేసి... సివిల్స్‌లో ఆల్ ఇండియా 66వ ర్యాంక్ సొంతం చేసుకున్నాను. 

ఒక UKG టీచ‌ర్ వ‌ద్ద..
నాలోని లోపాల‌ను తెలుసుకున్న వెంట‌నే... డైలీ Hand Writing కోసం 2 గంట‌లు ప్రాక్టీస్ చేసేవాడిని. ఒక UKG టీచ‌ర్ వ‌ద్ద Hand Writing నేను సంపూర్ణంగా నేర్చుకున్నాను.

కోచింగ్ : 
ఢిల్లీ, హైద‌రాబాద్‌ల‌లో తీసుకున్నారు. పర్ఫెక్ట్ గా కోచింగ్ మాత్రం బాల‌ల‌త మేడ‌మ్ వ‌ద్ద తీసుకున్నారు.

బాల‌ల‌త మేడ‌మ్ స‌హాయంతో...
బాల‌ల‌త మేడ‌మ్ వ‌ద్ద జాయిన్ కావాలంటే ఆమె నాకు ఒక ష‌ర‌తు పెట్టారు. ఉదయాన్నే 4:30 గంట‌ల‌కు వ‌చ్చి 3గంట‌లు ప‌రీక్ష రాయాలి. ఏరోజైతే నీవు రావో ఆ రోజు నుంచి నేను నీకు కోచింగ్ ఇవ్వ‌డం ఆపేస్తాన‌న్నారు. అలాగే ఈ మేడ‌మ్ గైడెన్స్ నాకు చాలా బాగా ఉప‌యోగ‌ప‌డింది.

నేను న‌మ్మిన ఫిలాస‌ఫీ ఇదే..
మ‌నం జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఫ్రెండ్స్ కావాలి... లైఫ్‌లో ఎద‌గాలి అంటే శ‌త్ర‌వులు ఉండాలి. అలాగే ఎద‌గాలంటే శ‌త్ర‌వుల‌ను కూడా గుర్తించాలి.

జాగ్ర‌ఫీ స‌బెక్ట్‌లో ఆల్ ఇండియా టాప‌ర్‌ని..!
చ‌దివింది ఇంజనీరింగే అయినా జాగ్రఫీ అంటే నాకు ఆసక్తి. సివిల్స్‌లో దాన్నే ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకున్నా. అలాగే సివిల్స్‌లో జాగ్ర‌ఫీ స‌బెక్ట్‌లో ఆల్ ఇండియా టాప‌ర్‌గా నిలిచాను. అలాగే ఆర్‌సీరెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లోనూ జాగ్రఫీ ఫ్యాకల్టీగా చేరాను. ఆ సంస్థలోనే రెండు సంవ‌త్స‌రాలు సివిల్స్ అభ్యర్థులకూ ఆ సబ్జెక్టును బోధించాను.

మెరుగైన ప్రిపరేషన్‌తో... ఒత్తిడి లేకుండా చ‌దివానిలా!
గతంలో మూడుసార్లు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రాసినప్పటికీ మెయిన్స్ దశలోనే వెనుదిరిగాను. అయినా నిరుత్సాహపడకుండా నాలోని లోపాల‌ను స‌రిచేసుకొని నాలుగోసారి పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నా. రోజుకు సుమారు 9 గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించాను. క్రమం తప్పకుండా తెలుగు, ఇంగ్లిష్ పేపర్లు చదివాను. ప్రతిరోజూ కొంత సబ్జెక్టును లక్ష్యంగా నిర్దేశించుకున్నా. వీలైనన్ని ఎక్కువ రాత పరీక్షలు రాశా. ప్రతిభను అంచనా వేసుకుని విశ్లేషించుకున్నా. ఇవన్నీ నాలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించాయి. సిలబస్‌ను పూర్తిగా ఆస్వాదిస్తూ మెరుగ్గా ప్రిపరేషన్ కొనసాగించాను. యోగా చేయడం ద్వారా ఒత్తిడి, అలసట నుంచి బయటపడ్డాను.

మంచి ర్యాంక్ వ‌చ్చింద‌ని తెలియ‌గానే...
సివిల్స్‌లో 66వ ర్యాంక్ వ‌చ్చింద‌ని తెలియ‌గానే పెద్ద‌గా సంతోష ప‌డ‌లేదు. కానీ... ఇంటికి వెళ్లి మా అమ్మ‌నాన్న మోహం చూడ‌గానే వాళ్ల ఆనందం చూసి చాలా సంతోషించాను. వీళ్ల క‌డుపున పుట్టినందుకు చాలా సంతోషం అన్పించింది ఆ స‌మ‌యంలో...

నా ఐఏఎస్..
మాది 2015 బ్యాచ్. జూలై 4వ తేదీన సివిల్స్‌లో ర్యాంక్ వ‌చ్చింది..సెప్టెంబ‌ర్ 7, 2015 తేదీన ఐఏఎస్ కన్ఫర్మేషన్ అయింది.

ఐఏఎస్ కాకుండా ఐపీఎస్ వ‌స్తే..
ఐఏఎస్ కాకుండా ఐపీఎస్ వ‌చ్చినా తీసుకునే వాడిని. అప్ప‌టికే మూడు సార్లు మధ్యలోనే అపజయం. ఈ స‌మ‌యంలో ఏది వ‌చ్చిన తీసుకునే వాడిని. కాక‌పోతే మ‌ళ్లీ ఐఏఎస్ కోసం రాసేవాడిని.

చదివిన పుస్తకాలు :
మెయిన్స్‌లో ఆప్షనల్ సబ్జెక్టు జాగ్రఫీ కోసం కుల్లర్, మాజిద్ హుస్సేన్, జి.సి. లియాంగ్ తదితర పుస్తకాలను చదివాను. జాగ్రఫీ ఆప్షనల్ ఎంచుకున్న వారికి ముఖ్యంగా అట్లాస్‌పై అవగాహన తప్పనిసరి.

నాకు స్ఫూర్తి, ప్రోత్సాహం వీరే...:
ముఖ్యంగా అమ్మ‌నాన్న‌ది. మా సిస్ట‌ర్‌. అలాగే సివిల్ సర్వీసెస్‌లో అడుగుపెట్టేందుకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి వేలూరు నరేంద్రనాథ్ నాకు స్ఫూర్తి. నా గురువు బీజేబీ కృపాదానం, ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ అధికారిణి మల్లవరపు బాలలత మేడ‌మ్‌ సబ్జెక్టు సందేహాలను తీర్చడంతోపాటు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ప్రోత్సహించేవారు. ‘దేశంలోని అత్యున్నత పోటీ పరీక్షలో గెలుపొందడానికి ఈ రోజు ఏం చేశాను’ అని రోజూ పడుకునే ముందు ప్రశ్నించుకోవాలని వారు సూచించిన సలహా నిత్యం నా కర్తవ్యాన్ని గుర్తుచేసేది. అలాగే నా ఫ్రెండ్ హ‌రిప్ర‌సాద్‌. 

నా ఇంటర్వ్యూ సాగిందిలా..
ఎలాంటి ఒత్తిడిలేని, సానుకూల వాతావరణంలో దాదాపు అరగంటసేపు ఇంటర్వ్యూ సాగింది. ఐదుగురు సభ్యులున్న మన్‌బీర్‌సింగ్ బోర్డు ఇంటర్వ్యూ నిర్వహించింది. విభిన్న అంశాలపై లోతుగా ప్రశ్నలు అడిగారు. ఒక్కోదానిపై వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలు అడగడం ద్వారా ఆయా అంశాల్లో నా పరిజ్ఞానం ఎంతో పరీక్షించారు. కేవలం మేక్ ఇన్ ఇండియాపైనే సుమారు 7 ప్రశ్నలు అడిగారు. అలాగే గుంటూరు జిల్లా దేనికి ఫెమ‌స్ అని అడిగారు. వారు అడిగిన‌ అన్ని ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలిచ్చాను.

నా ఇంట‌ర్వ్యూలో అడిగిన ప్రశ్నలు ఇవే..:
➤ జీఎస్‌టీ (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్) అంటే ఏమిటి? కేంద్ర ప్రభుత్వాలు ఈ విషయంలో రాష్ట్రాలను ఎలా పరిరక్షించాలని నువ్వు అనుకుంటున్నావు?
➤ లీ క్యుయాంగ్ హ్యూ ఎవరు? సింగపూర్‌లో ఆయన చేసిన పబ్లిక్ పాలసీని వివరించు? ఆయన విధానాలను నువ్వు సమ్మతిస్తావా? లీ క్యుయాంగ్ హ్యూ సింగ‌పూర్‌ని ఎలా డెవ‌ల‌ప్ చేశారు?
➤ నీవే క‌నుక గుంటూరు జిల్లా క‌లెక్ట‌ర్ అయితే.. పొగాకు పంటను నిషేధిస్తావా? 
➤ గుంటూరులో పొగాకు పండించడం సమంజసమేనా...?
➤ మహిళ సాధికారత అంటే ఏంటి? ఉద్యోగినులకు ఉన్న బాధ్యతలు ఏంటి? పిల్లలను బేబీకేర్ సెంటర్లలో ఉంచి తల్లి ఉద్యోగాలకు వెళ్లడం ఎంత వరకు సమంజసం?
➤ మేక్ ఇన్ ఇండియా అంటే ఏమిటి? దాన్ని ఏ విధంగా సక్సెస్ చేయగలవు?

సివిల్స్ సాధించాల‌నే వారికి నా స‌ల‌హా ఇదే..
సివిల్స్ చాలా కష్టసాధ్యమైన పరీక్ష. కానీ అసాధ్యం కాదు. కష్టపడి చదివితే సాధారణ విద్యార్థులు సైతం విజేతలుగా నిలవొచ్చు. సివిల్స్ సిలబస్ సముద్రంలా విస్తృతమైంది. అలాగే పోటీకూడా చాలా ఎక్కువ‌గా ఉంటుంది. అంతా చదివేయాలని తొందరపడొద్దు. ఎందుకంటే అన్ని సబ్జెక్టుల్లో ఎవరూ వంద శాతం మాస్టర్ కాలేరు. టెక్నిక్స్ తెలుసుకుని చదవాలి. కోచింగ్ తీసుకుంటే చాలా వరకు శ్రమ తగ్గుతుంది. విస్తృతమైన సబ్జెక్టుపై అవగాహన ఏర్పడుతుంది. తెలుగు మీడియంలో సివిల్స్‌కు సన్నద్ధమయ్యేవారు ముందు నుంచే సొంత నోట్సును ప్రిపేర్ చేసుకోవాలి. మార్కెట్‌లో మెటీరియల్ అందుబాటులో ఉండే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ తదితర ఆప్షనల్స్‌ను ఎంచుకోవడం మంచిది. ఇందులో ప్ర‌తిమార్కు చాలా విలువైంది. రైటింట్ ప్రాక్టీస్ చాలా ముఖ్యం. మ‌నం రాసేదానికి మెంట‌ర్ ఉంటే మంచిది. టాపిక్‌లోని పూర్తి స‌మాచారం తెలుసుకోవాలి.

నా లక్ష్యం:
సోషల్ సర్వీస్‌పై నాకు ముందు నుంచీ ఆసక్తి ఎక్కువ. వెనుకబడిన తరగతుల అభ్యున్నతి, మహిళా సాధికారత, అందరికీ నాణ్యమైన విద్య లక్ష్యంగా పని చేస్తాను.

వివాహాం:
నా ట్రైనింగ్ అయిన 1 సంవ‌త్స‌రం త‌ర్వాత పెళ్లి చేసుకున్నాను. మా బార్య పేరు Raaga Deepa.చార్టర్డ్ అకౌంటెంట్. అలాగే మా మామ‌గారు కూడా చార్టర్డ్ అకౌంటెంట్ .మాకు ఒక బాబు. బాబు పేరు Rishith Nanda.

#Tags