UPSC Civil Services Results 2023 Date : యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌-2023 ఫైన‌ల్ ఫ‌లితాల విడుద‌ల‌.. తేదీ ఇదే..! ఈ సారి తెలుగు రాష్ట్రాల నుంచి..

సాక్షి ఎడ్యుకేష‌న్ : యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (UPSC) సివిల్‌ సర్వీసెస్‌-2023 ఇంటర్వ్యూలు.. 2024 ఏప్రిల్ 9వ తేదీన (మంగ‌ళ‌వారం) ముగియ‌నున్నాయి.

అలాగే ఈ సారి యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌-2023 ఫైన‌ల్ ఫ‌లితాల‌ను 2024 ఏప్రిల్ 15వ తేదీన విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 90 మంది వరకు అభ్యర్థులు ఈ సారి సివిల్స్‌ ఇంటర్వ్యూకు హాజ‌రయ్యారు. మొత్తం దేశ వ్యాప్తంగా సివిల్స్ ఇంటర్వ్యూలకు 2,844 మంది అర్హత సాధించారు.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్ 2023 నోటిఫికేషన్‌ను ఫిబ్ర‌వ‌రి 1వ తేదీన (బుధ‌వారం) విడుదల చేసిన విష‌యం తెల్సిందే. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1105 వివిధ సివిల్ సర్వీసులకు చెందిన  ఉద్యోగాల భర్తీ చేయ‌నున్నారు.

☛ UPSC Civil Services Prelims - Online Test Series: Click Here 

#Tags