UPSC Civils 2nd Ranker Animesh Pradhan Story : చిన్న వ‌య‌స్సులోనే నాన్న మృతి.. మ‌రో వైపు సివిల్స్ ఇంట‌ర్వ్యూ టైమ్‌లోనే అమ్మ మ‌ర‌ణం.. ఆ బాధతోనే..

ఈయ‌న జీవితంలో అన్ని ఊహించని విధంగా ఎన్నో క‌ష్టాల‌ను ఎదుర్కొన్నాడు. ఒక వైపు నాన్న మ‌ర‌ణం.. స‌రిగ్గా సివిల్స్ ఇంట‌ర్వ్యూ స‌మయంలోనే తల్లి ప్రాణాలు ప్రాణాలు కొల్పొయింది. ఇలాంటి క్లిష్ట‌మైన స‌మ‌యంలోనే త‌న‌లోని బాధ‌ను దిగమింగి.. సివిల్స్ ఇంట‌ర్వ్యూకు హాజర‌య్యాడు.

ఇటీవ‌లే విడుద‌ల చేసిన యూపీఎస్సీ సివిల్స్ ఫైన‌ల్ 2023 ఫ‌లితాల‌ల్లో జాతీయ స్థాయిలో రెండో ర్యాంక్ సాధించాడు. ఈయ‌నే అనిమేశ్‌ ప్రధాన్‌. కేవ‌లం 24 ఏళ్ల వ‌య‌స్సులోనే ఈ ఘ‌న‌త సాధించి రికార్డు క్రియేట్ చేశాడు. ఈ నేప‌థ్యంలో సివిల్స్ 2వ ర్యాంక‌ర్ అనిమేశ్‌ ప్రధాన్ స‌క్సెస్ స్టోరీ మీకోసం..

అనిమేశ్.. ఒడిశాలోని అనుగుల్‌ జిల్లాలోని తాల్‌చేర్‌కు చెందిన వారు.  కేంద్రీయ విద్యాలయంలో చదువుకున్నారు. రావుర్కెలాలోని ఎన్‌ఐటీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు.

☛ Civils 2023 Ranker Hanitha Inspire Success Story : కాలం కదలలేని స్థితిలో పడేస్తే.. ఈమె సంకల్పం సివిల్స్ కొట్టేలా చేసిందిలా.. కానీ..

లేని లోటు పూడ్చలేనిది..
తొమ్మిదేళ్ల క్రితం తండ్రి మృతి చెందాడు.. సరిగ్గా ఇంటర్వ్యూ సమయంలో.. క్యాన్సర్‌తో పోరాడుతూ ఇటీవలే తల్లి ప్రాణాలు కోల్పోయింది. అంతటి విషాదకర పరిస్థితుల్లోనూ బాధను దిగమింగి.. లక్ష్యసాధన దిశగా ముందుకు సాగాడు. యూపీఎస్సీ సివిల్స్ 2023 పరీక్షలో.. మొద‌టి ప్ర‌య‌త్నంలోనే.. దేశంలోనే రెండో స్థానంలో నిలిచాడు. 

నా కల నెరవేరిందిలా.. నా తల్లిదండ్రులకు..

యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితం విషయంలో చాలా సంతృప్తిగా ఉందని అనిమేశ్‌ ప్రధాన్ అన్నారు. ఎట్ట‌కేల‌కు నా కల నెరవేరింద‌న్నారు. ముఖ్యంగా నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. గత నెలలో సివిల్ సర్వీసెస్ పరీక్షకు ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు మా అమ్మను కోల్పోయాను. 2015లో నాన్న మృతి చెందారు. అప్పుడు నేను 11వ తరగతి చదువుతున్నా. వారు లేని లోటు పూడ్చలేనిది అని చెప్పారు.

➤☛ UPSC 2021 Civils Ranker: ఈ ఆప‌రేష‌న్ వ‌ల్లే ఉద్యోగం కొల్పోయా.. నాన్న చెప్పిన ఆ మాట‌లే ర్యాంక్ కొట్టేలా చేశాయ్‌..

ఉద్యోగం చేస్తూనే.. ఎటువంటి కోచింగ్ లేకుండానే..
ప్రస్తుతం దిల్లీలోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ రిఫైనరీస్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు. అనిమేశ్ 2022లో యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిపరేషన్‌ ప్రారంభించారు. అలాగే సివిల్స్‌లో సోషియాలజీని ఆప్షనల్‌గా ఎంచుకున్నారు. ప్ర‌తి రోజు 6 గంటల పాటు సివిల్స్ ప్రిప‌రేష‌న్‌కు చదివే వారు. యూపీఎస్సీ సివిల్స్‌కు ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు.

నా తొలి ప్రాధాన్యత దీనికే..


అనిమేశ్‌ ప్రధాన్ ఐఏఎస్‌కు తొలి ప్రాధాన్యత ఇస్తాన్నారు. అఆగే సొంతం రాష్టం అయిన‌ ఒడిశా క్యాడర్‌ ఆశిస్తున్నట్లు అనిమేశ్‌ చెప్పారు. నా రాష్ట్ర ప్రజలకు, అలాగే ముఖ్యంగా అట్టడుగు వర్గాలు, వెనుకబడిన ప్రాంతాల వారి అభ్యున్నతి కోసం పని చేయాలనుకుంటున్నా అని తెలిపారు. నేటితరం యువ‌త‌కు అనిమేశ్ పోరాట‌త‌త్వం, జీవితం స్ఫూర్తినిస్తుంది.

 IAS Officer Success Story : ఒక వైపు కరోనాతో తండ్రి మ‌ర‌ణం.. మ‌రో వైపు సివిల్స్ ఇంటర్వ్యూ.. చివ‌రికి..

#Tags