Success Journey of Young Man: ఏడో ప్ర‌య‌త్నంలో సాధించిన ర్యాంకు

చాలా త‌క్కువ మంది స‌హ‌నంతో విజ‌యానికి చేరే ప్ర‌య‌త్నం చేస్తారు. వారిలో ఒక‌రే ఈ షమీర్‌రాజా. ఇత‌ను సాధించిన ర్యాంకు ఒక‌టో రెండో ప్ర‌య‌త్నంలో వ‌చ్చినంది కాదు. ఇత‌ని స‌హ‌న విజ‌యం ఎంతో మంది యువ‌త‌కు ఆద‌ర్శం. ఇత‌ని ప్ర‌యాణం ప్రోత్సాహ‌క‌రం. అటువంటి ఈ యువ‌కుడి విజ‌యం వెనుక ఉన్న కృషి, ప్ర‌యాణం తెలుసుకుందాం..
Sameer Raja.. all India ranker for IAS

పట్టణంలోని ఎస్కేడీ కాలనీలో నివాసముంటున్న నరసింహులు, ఉషా దంపతుల కుమారుడు షమీర్‌రాజా మంగళవారం విడుదలైన సివిల్స్‌ ఫలితాల్లో ఆల్‌ఇండియా స్థాయిలో 464వ ర్యాంకు సాధించారు. ఇతని తండ్రి నరసింహులు గుంతకల్‌ రైల్వేశాఖలో డీఆర్‌ఎం ఆఫీసు సూపరింటెండెంట్‌గా కాగా.. తల్లి గృహిణి. చెల్లెలు షర్మిల ఎంబీబీఎస్‌ పూర్తి చేసి రేడియాలాజీలో ఎండీగా శిక్షణ పొందుతోంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న షమీర్‌రాజా ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడారు.

Civils Rankers: యూపీఎస్సీలో విజ‌యం సాధించిన తెలుగు విద్యార్థులు

1 నుంచి 10వ తరగతి వరకు ఆదోనిలోని మిల్టన్‌ పాఠశాలలో, ఇంటర్‌ హైదరాబాద్‌లోని నారాయణ కళాశాలలో పూర్తి చేశానన్నారు.ఆ తర్వాత వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో 2015లో బీటెక్‌ పూర్తయిందన్నారు. ఆ వెంటనే ఢిల్లీలో సివిల్స్‌ కోచింగ్‌ తీసుకున్నట్లు చెప్పారు. ఆరుసార్లు సివిల్స్‌ పరీక్ష రాయగా.. ఇంటర్వూ వరకు వెళ్లి విఫలమయ్యానన్నారు.

APPSC Ranker Success Story: వ‌రుస‌గా రెండుసార్లు గ్రూప్-1 తో పోస్టు కొట్టిన యువ‌తి.. ఇప్పుడు?

2020లో వచ్చిన ఫలితాల్లో 603 ర్యాంకు రాగా.. ప్రస్తుతం ఇండియన్‌ సివిల్‌ అకౌంట్స్‌ సర్వీస్‌లో మినిస్ట్రీ ఆఫ్‌ ఫైనాన్స్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగం చేస్తూనే 2022లో సివిల్స్‌ రాయగా.. ఆలిండియా స్థాయిలో 464వ ర్యాంకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ ర్యాంకుతో ఐఆర్‌ఎస్‌ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

#Tags