Inspirational Story: పేదరికాన్ని జయించాడు... సివిల్స్ సత్తా చాటాడు..
సివిల్ సర్వీసెస్–2018 ఫలితాల్లో వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలం ఎర్రబల్లికి చెందిన నునావత్ ప్రవీణ్‌నాయక్ 610 ర్యాంక్‌ను సాధించాడు. నునావత్ భీమా నాయక్–రాజమ్మ దంపతులది నిరుపేద కుటుంబం. వారి కుమారుడు ప్రవీణ్ నాయక్ ఒకటో తరగతి నుంచి టెన్త్ వరకు కరీంనగర్‌లోని పారమిత హైస్కూల్లో చదువుకున్నాడు.
ఎడ్యుకేషన్..:
పదో తరగతి పూర్తికాగానే 2008 సంవత్సరం హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్(ఎంపీసీ), అనంతరం వీఎన్‌ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చేశాడు. సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో బీటెక్ పూర్తి కాగానే ఢిల్లీలో కొన్ని నెలల పాటు కోచింగ్ తీసుకున్న ప్రవీణ్ నాయక్ 2016 సివిల్స్ మెయిన్స్‌లో తప్పాడు. రెండో ప్రయత్నంలో లక్ష్యం సాధించాడు.
ఎర్రమట్టి అమ్మి వచ్చిన డబ్బులతో..
నా కుమారుడు సివిల్స్ సాధించడం చాల సంతోషంగా ఉంది. మాది చాలా పేద కుటుంబం. మా తండాల్లో ఎర్రమట్టి విక్రయాలే జీవనాధారం. మా తండ్రి నునావత్ బిక్యా–బూలమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. నాన్న ఎర్రమట్టి అమ్మి వచ్చిన డబ్బులతో నన్ను చదివించాడు. ప్రస్తుతం మా ఇద్దరు తమ్ముళ్లలో ఒకరు ఆటో డ్రైవర్‌గా, మరో తమ్ముడు లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. నేను పదో తరగతి వరకు ముల్కనూర్‌లో చదువుకున్నాను. 1996 సంవత్సరంలో ఓరియంటల్ బ్యాంక్ కామర్‌లో ఫ్యూన్‌గా ఉద్యోగం లభించింది. నాకు కుమారుడు ప్రవీణ్‌తో పాటుగా కూతురు నవ్య సంతానం. నవ్య ఇప్పుడు డిగ్రీ చదువుతోంది.
– భీమా నాయక్, ప్రవీణ్ నాయక్ తండ్రి
ఈ తపనతోనే..
మాది పేద కుటుంబం.. సివిల్స్ చదవాలనే తపన ఇంటర్మీడియట్‌లోనే కలిగింది. అప్పటి నుంచి అందే సంకల్పంతో బీటెక్ పూర్తి కాగానే సివిల్స్‌పై దృష్టి సారించి ఢిల్లీలో కోచింగ్‌కు వెళ్లాను. అయిప్పటికీ స్వతహాగా నోట్స్ తయారు చేసుకున్నాను. ఇతర పుస్తకాలతోపాటు నిత్యం పేపర్ చదివాను. సివిల్స్ సాధించడానికి ఇవి తోడ్పడ్డాయి. పేపర్ చదవడం ద్వారా అనేక విషయాలు తెలుసుకోవచ్చు. నిత్యం 8 నుంచి 10 గంటలు ప్రిపేరయ్యాను. ఆశయం ఉంటే లక్ష్యం సాధించడం కష్టమేమి కాదు.
– నునావత్ ప్రవీణ్ నాయక్, సివిల్స్ ర్యాంకర్
Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్ వైపు..నా సక్సెస్‌కు కారణం వీరే..
Veditha Reddy, IAS : ఈ సమస్యలే నన్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్...
Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..
Chandrakala, IAS: ఎక్కడైనా సరే..‘తగ్గేదే లే’
Success Story: పేదరికం అడ్డుపడి.. వేధించిన నా లక్ష్యాన్ని మాత్రం మరువలేదు..