IPS Dream: ఐపీఎస్ కోసం ల‌క్ష‌ల జీతాన్ని కూడా కాద‌న్నాడు.. మొత్తానికి..!

ఏదో ఒక చ‌దువు చ‌దివి, ఉద్యోగం సంపాదించాల‌న్న కోరికే చాలా మందిలో ఉంటుంది. అటువంటిది, ఈ యువ‌కుడు స‌మాజానికి, ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందించాల‌న్న ఒకే ఆలోచ‌న‌తో త‌న‌క వ‌చ్చిన ల‌క్ష‌ల జీతం ఇచ్చే ఉద్యోగాన్ని కూడా కాద‌నుకున్నాడు. ఇలా మొద‌లు పెట్టిన త‌న ఐపీఎస్ ప్ర‌యాణం ఎన్ని మ‌లుపులు తిరిగి, చివ‌రికి ఎటు దారి తీసిందో తెలుసా..

మొదటి మూడు పర్యాయాలు ప్రిలిమ్స్‌ వరకే వెళ్లిన రిత్విక్‌.. నాలుగోసారి మెయిన్స్‌ వరకు చేరుకున్నారు. ఐదో ప్రయత్నంలో ప్రిలిమనరీ, మెయిన్స్‌తోపాటు ఇంటర్వ్యూకు చేరుకుని 558వ ర్యాంకు సాధించాడు.

Success Story: ఎప్పుడూ ప్ర‌యాణం చేస్తూనే ఉంటాడు.. అయినా పొందాడు ఎన్నో అవార్డులు.. ఎలా అంటే..

హనుమకొండ రాంనగర్‌కు చెందిన కొట్టె రాధాకృష్ణారావు, మంజుల దంపతులకు కుమారుడు రిత్విక్‌ సాయి, కుమార్తె రిషిక ఉన్నారు. రిత్విక్‌ సాయి తండ్రి రాధాకృష్ణారావు హసన్‌పర్తి భీమారంలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కళాశాలలో లైబ్రేరియన్‌. తల్లి మంజుల ఫ్యామిలీ కౌన్సిలర్‌. రిత్విక్‌ సాయి పాఠశాల విద్య హనుమకొండ బాలసముద్రంలోని గురుకుల్‌ పాఠశాలలో పూర్తి చేశారు.

Collector Successful Duties: క‌లెక్ట‌ర్ బాధ్య‌త‌ల‌తో పాటు త‌ల్లిగా కూడా అంద‌రికీ ఆదర్శం..!

హైదరాబాద్‌ కొంపెల్లిలోని పేజ్‌ అకాడమీలో ఇంటర్మీడియట్‌ చదివారు. బీటెక్‌ ఈసీఈ ఢిల్లీ నోయిడాలోని శివనాడార్‌ యూనివర్సిటీలో అభ్యసించాడు. బీటెక్‌ పూర్తి చేసిన తర్వాత మల్టీ నేషనల్‌ కంపెనీలో నెలకు రూ.1.50 లక్షల జీతంతో ఉద్యోగం రాగా, సివిల్స్‌పై ఉన్న ఆసక్తితో ఉద్యోగంలో చేరలేదు.

ఐపీఎస్‌ ప్రథమ ప్రాధాన్యత

ఐపీఎస్‌ నా ప్రథమ ప్రాధాన్యత. అయితే ఐఆర్‌ఎస్‌, ఐటీకి ఎంపికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2017 నుంచి సివిల్స్‌కు సిద్ధమవుతున్నా. సివిల్స్‌ ద్వారా ప్రజాసేవ చేయొచ్చని పట్టుదలతో చదివా. 2017 నుంచి ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌లలో సివిల్స్‌ కోచింగ్‌ తీసుకున్నా. నా పట్టుదలకు తోడు అదృష్టం కలిసి వచ్చింది.

Padmaja Kumari Parmar Success Story : రూ.50 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి మహారాణి.. అయినా కూడా ఇలాంటి ప‌నులు చేస్తోంది..!

ర్యాంకు రావడం సంతోషకంగా ఉంది

మా కుమారుడికి సివిల్స్‌ 558వ ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. చిన్న నాటినుంచి ప్రజా సేవ చేయాలనే ఆసక్తి ఉండేది. సివిల్స్‌ ద్వారా అయితే మంచి అవకాశమని భావించి ఈ దిశగా కష్ట పడ్డాడు. ఐదేళ్లుగా పండుగలు, శుభకార్యాలకు దూరంగా ఉన్నాడు.

Inspiring Mother Daughter: తీవ్ర‌ రోడ్డు ప్ర‌మాదానికి గురైనా విద్యార్థిని.. అయినా ప‌రీక్ష‌లో 90 శాతం..!

రాధాకృష్ణారావు, మంజుల
 

#Tags