IPS Manoj Kumar Sharma Inspiring Story : '12th Fail' ఫెయిల్.. బిచ్చగాళ్లతో పడుకున్నా..ఈ క‌సితోనే ఐపీఎస్ అయ్యా.. కానీ..

బిచ్చగాళ్లతో రోడ్డుపై పడుకున్నాడు. చ‌దువులో ఫెయిల్ అయ్యాడు. క‌ఠిన పేద‌రికం అనుభ‌వించాడు. పేదరికంతో ప్రతీదాని కోసం ఓ పోరాటం చేయాల్సి వ‌చ్చింది. ఈ పోరాటంతోనే కొండను ఢీకొన్నాడు.

ఎంతో క‌ష్ట‌ప‌డి చ‌దివి ఐపీఎస్ ఉద్యోగం సాధించి.. అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఈయ‌నే ఐపీఎస్ మ‌నోజ్ శర్మ. ఈ నేప‌థ్యంలో ఐపీఎస్ మ‌నోజ్ శర్మ స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం..

నిరుపేద కుటుంబంలో పుట్టిన మనోజ్.. పేదరికంతోనే పెరిగారు. రాత్రి సమయంలో బిచ్చగాళ్ల మధ్య రోడ్డుపై పడుకున్న రోజులు కూడా చ‌లా ఉన్నాయి ఆయన జీవితంలో. ఇలా ఎన్నో క‌ష్టాలు ప‌డి చ‌దుతూ.. నేడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ క‌మిష‌న్ (UPSC) నిర్వ‌హించే సివిల్స్‌లో జాతీయ స్థాయిలో 121వ ర్యాంక్ సాధించి ఐపీఎస్ అధికారి అయ్యాడు. 

కుటుంబం..
మ‌నోజ్ శర్మది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మెరెనా జిల్లాలో ఓ మారుమూల గ్రామం. ఈయ‌న ఓ సాధారణ నిరుపేద కుటుంబంలో పుట్టారు. పోలీస్‌ కావాలని చిన్నప్పటినుంచి కలలు కన్నారు. ఇందుకోసం ఎన్నో కష్టాలు పడ్డారు. చదువు విషయంలో ఆయనకు అంతా వింతగా ఉండేది. చదువు సరిగా అబ్బలేదు. 

చ‌దువులో ఫెయిల్ అవుతూనే..

మ‌నోజ్ శర్మ.. 10వ తరగతి థర్డ్ క్లాస్‌లో పాస్ అయ్యాడు. ఇంటర్మీడియేట్‌లో హిందీ సబ్జెక్ట్ తప్ప అన్ని సబ్జెక్ట్ లు ఫెయిల్ అయ్యారు. అయినా వెనక్కు తగ్గలేదు. తర్వాత పట్టు వదలని విక్రమార్కుడిలా చదివి ఫెయిల్‌ అయిన అన్ని పరీక్షల్లో ఫాస్‌ అయ్యారు. అలాగే యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ను నాలుగు సార్లు రాసి మరీ తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. చిన్నప్పటి నుంచి పేదరికంలో మగ్గుతూ జీవితం సాగించిన మనోజ్ శర్మ ఎప్పుడూ కుంగిపోలేదు. తన పరాజయాలను సోపానాలుగా చేసుకుని మరింత పట్టుదలతో చదివారు.

☛ IAS Success Story : మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ 2వ‌ ర్యాంక్ కొట్టా.. క‌లెక్ట‌ర్ అయ్యా.. కానీ నా భ‌ర్త..

తమ జీవితంలో ఏ చిన్న కష్టము వచ్చినా పలాయన మంత్రం పఠిస్తూ.. ఒకొక్కసారి జీవితాన్ని అంతం చేసుకుంటారు కూడా.. ఇందుకు ఉదాహరణగా నిలుస్తారు కొందరు ఇంటర్ స్టూడెంట్స్. ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించలేదని క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతూ కన్నతల్లిదండ్రులకు గుండె కోతను మిగులుస్తున్నారు. పడి లేచే అలలను కొందరు ఆదర్శంగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురయ్యే కష్టాలను, నష్టాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకువెళ్తారు. చరిత్రలో తమకంటూ ఓ పేజీని లిఖించుకుంటారు. అదే సమయంలో ఇంకొందరు.. తమ జీవితంలో ఏ చిన్న కష్టం వచ్చినా పలాయన మంత్రం పఠిస్తూ.. ఒకొక్కసారి జీవితాన్ని అంతం చేసుకుంటారు కూడా. ఇందుకు ఉదాహరణగా నిలుస్తారు కొందరు ఇంటర్ స్టూడెంట్స్. 

IAS Officer Success Story : ఒక వైపు కరోనాతో తండ్రి మ‌ర‌ణం.. మ‌రో వైపు సివిల్స్ ఇంటర్వ్యూ.. చివ‌రికి..

చివ‌రికి.. ఇంటర్వ్యూలో కూడా ఫెయిల్‌..
యూనియన్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(UPSC) సివిల్స్ ప‌రీక్ష‌ను ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. ఉత్తీర్ణత సాధించడం కష్టతరమైన పరీక్షలలో ఇది ఒకటి. అంతేకాదు చాలా అరుదుగా అభ్యర్థులు మొదటి ప్రయాణంలో పరీక్షను ఛేదిస్తారు. కొందరు రాత‌పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తారు.. కానీ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించలేరు. మరికొందరు మొదటి ప్రయాణంలో రెండింటిలోనూ ఉత్తీర్ణులవుతారు. అదే సమయంలో యూపీఎస్సీ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలనే కలను కంటూ.. తాము కన్న కలను నెరవేర్చుకోవడం కోసం ఒకసారి రెండు సార్లు కాదు.. తమ లక్ష్యం సాధించే వరకూ ప్రయత్నించేవారు కూడా ఉన్నారు. వారిలో ఒకరు ఐపీఎస్ అధికారి మనోజ్ శర్మ. తన నాలుగో ప్రయత్నంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌లో విజయం సాధించారు.

వివాహాం :

మనోజ్ శర్మ చిన్ననాటి క్లాస్‌మేట్ ఇప్పుడు జీవిత భాగస్వామి శ్రద్ధ.. అన్నివిధాలా మనోజ్ కు అండగా నిలబడ్డారు. UPSC పరీక్షలో మనోజ్ చేస్తున్న ప్రయాణంలో శ్రద్ధ సహాయం చేసింది. మనోజ్ 12వ తరగతి చదువుతున్న సమయంలో శ్రద్ధను కలిశారు. తన ప్రేమను చెప్పడానికి సంకోచించారు. అనంతరం మనోజ్ శ్రద్ధకు తన ప్రేమని ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకున్నారు.

☛ IAS Achievement : ఎటువంటి శిక్ష‌ణ లేకుండానే.. రెండో ప్ర‌య‌త్నంలోనే ఐఏఎస్ కొట్టానిలా..

మనోజ్ తన జీవితంలో చాలా అడ్డంకులను ఎదుర్కొన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన మనోజ్.. పేదరికంతోనే పెరిగారు. రాత్రి సమయంలో బిచ్చగాళ్ల మధ్య రోడ్డుపై పడుకున్న రోజులు కూడా ఉన్నాయి ఆయన జీవితంలో. యూపీఎస్సీ పరీక్షలో మూడుసార్లు విఫలమయ్యారు. నాలుగో ప్రయత్నంలో 121వ ర్యాంకు సాధించి ఐపీఎస్ అధికారి అయ్యారు. ప్రస్తుతం యూపీఎస్సీ టాపర్ మనోజ్ శర్మ ముంబై పోలీస్‌ శాఖలో అదనపు కమిషనర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

ఈయ‌నపై  '12th Fail' అనే సినిమా వ‌చ్చి..

నా వాళ్లు అనుకున్న వాళ్లను మనోజ్‌ శర్మ ఎప్పుడూ వదులుకోలేదు. యూపీఎస్సీ పరీక్ష ప్రిపరేషన్ సమయంలో తనకు అన్ని విషయాలలో సాయం చేసి, అండగా నిలబడిన చిన్ననాటి స్నేహితురాలు శ్రద్ధను జీవిత భాగస్వామిని చేసుకున్నారు. మనోజ్‌ సెక్సెస్‌ స్టోరీపై “ట్వెల్త్‌ ఫెయిల్” అనే పుస్తకం కూడా వెలువడింది. ఇటీవ‌లే ఈయ‌నపై  '12th Fail' అనే సినిమా వ‌చ్చింది. ఈ సినిమా కూడా ప్ర‌స్తుతం విజ‌య‌వంతం న‌డుస్తోంది.

మనోజ్‌ ఢిల్లీలోని ఓ గ్రంథాలయంలో కొంతకాలం పనిచేశాడు. ఆ అనుభవం పరీక్షల ప్రిపరేషన్‌కు ఎంతగానో ఉపకరించింది. అక్కడ మాగ్జిం గోర్కి, అబ్రహం లింకన్‌లాంటి రాజనీతివేత్తలు మొదలు గజానన్‌ మాధవ్‌ ముక్తిబోధ్‌ లాంటి సాహితీవేత్తల వరకు గొప్ప గొప్ప వ్యక్తుల జీవితాలను అధ్యయనం చేశాడు. వాటినుంచి తన జీవిత ప్రయాణానికి కావాల్సినంత స్ఫూర్తిని పొందాడు.

☛➤ Women IAS Success Story : ఫెయిల్ అవుతునే ఉన్నా.. కానీ ప్ర‌య‌త్నాన్ని మాత్రం ఆప‌లేదు.. చివ‌రికి ఐఏఎస్ కొట్టానిలా..

భారతదేశ ఉద్యోగ స్వామ్యంలో సివిల్‌ సర్వీసులది అత్యున్నత స్థానం. డిగ్రీ పట్టా అందుకున్న లక్షలాది మంది విద్యార్థుల కలల కొలువు ఇది. ఏటా విజేతలుగా నిలిచేది వందల మందే అయినా, ఒక్కొక్కరి గెలుపు వెనుక ఒక్కో స్ఫూర్తిదాయకమైన,ఆసక్తికరమైన కథ కచ్చితంగా ఉండితీరుతుంది. మనోజ్‌కుమార్‌ శర్మ, శ్రద్ధ జోషి దంపతుల నేపథ్యం కూడా ఇలాంటిదే. మనోజ్‌ సివిల్స్‌ ప్రస్థానం నేపథ్యంతో తీసిన ‘12th Fail’  హిందీ చిత్రం ఈ మధ్యే విడుదలైంది. విధు వినోద్‌ చోప్రా నిర్మాణం, దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఇందులో విక్రాంత్‌ మాసే, పాలక్‌ లాల్వాణీ ప్రధాన పాత్రధారులు. అక్టోబర్‌, నవంబర్‌ నెలలు.. సుదీర్ఘమైన పరీక్షల సన్నద్ధత మధ్యలో సివిల్స్‌ పరీక్షా ర్థులు కాస్త విశ్రాంతి తీసుకునే రోజులు. 

➤   Success of Childhood Dream as IAS: నా తండ్రి చెప్పిన మాట‌లే ఐఏఎస్ ను చేశాయి..

కాబట్టి, సమయం చూసుకునే.. ‘12th Fail’ చిత్రాన్ని విడుదల చేశారని భావించవచ్చు. ఇందులో విక్రాంత్‌, పాలక్‌తోపాటు నటించిన మరోవ్యక్తి వికాస్‌ దివ్యకీర్తి. ఈయన 1996లో తన తొలి ప్రయత్నంలోనే సివిల్‌ సర్వీస్‌ పరీక్షల్లో విజేతగా నిలిచారు. ఇంతకుముందు కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో అధికారిగా పనిచేశారు. సివిల్స్‌ ఆశావహులకు మార్గనిర్దేశం చేయడానికి సొంత శిక్షణ సంస్థను స్థాపించే క్రమంలో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో సివిల్స్‌ కోచింగ్‌ సెంటర్లు ఎక్కువగా ఉండే ముఖర్జీనగర్‌లో ‘దృష్టి ఐఏఎస్‌’ పేరుతో కోచింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. పైగా ‘12th Fail’ సినిమాలో చాలాభాగం ఇక్కడే చిత్రీకరించడం గమనార్హం. మరో ముచ్చట… మనోజ్‌ కుమార్‌ ఐపీఎస్‌ స్వయంగా వికాస్‌ దివ్యకీర్తి శిష్యుడు.

మనోజ్‌ మధ్యప్రదేశ్‌ రాష్ట్రం మొరేనాకు చెందినవాడు. నిరుపేద కుటుంబం. పదో తరగతిలో తృతీయ శ్రేణిలో పాసైనా.. పన్నెండో తరగతిలో మాత్రం హిందీ తప్ప అన్ని సబ్జెక్టులూ ఫెయిలయ్యాడు. ఇక్కడే ఓ సంఘటన మనోజ్‌ జీవితాన్ని మలుపుతిప్పింది. తన క్లాస్‌మేట్‌ శ్రద్ధా జోషితో మనోజ్‌ ప్రేమలో పడ్డాడు. అయితే పన్నెండో తరగతి ఫెయిలైన కారణంగా ఆమెకు తన ప్రేమ విషయాన్ని వెల్లడించడానికి భయపడిపోయాడు. చివరికి ఓ రోజు ధైర్యం చేసి మనసులో మాట చెప్పాడు. “నువ్వు గనుక నా ప్రేమను అంగీకరిస్తే, ప్రపంచాన్ని తలకిందులు చేస్తాను” అని ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించాడు. 

శ్రద్ధ మనోజ్‌ను తిట్టడమో, చెంపమీద కొట్టడమో చేయలేదు. అకడమిక్‌ రికార్డును గుర్తుచేసి వెక్కిరించనూ లేదు. అతని ప్రేమకు ఆమోదం తెలిపింది. ప్రేమ విజయం మనోజ్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. జీవితంలో దేన్నయినా సాధించగలననే నమ్మకం కలిగించింది. తన చిరకాల స్వప్నమైన ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌ – ఐపీఎస్‌ కొలువును సాకారం చేసుకోవాలని తీర్మానించు కున్నాడు. ఉన్నపళంగా సివిల్స్‌కు ప్రిపేర్‌ కావడం మొదలుపెట్టాడు. ఈ ప్రయత్నంలో శ్రద్ధా జోషి అన్ని విధాలుగా అండగా నిలిచింది. ఆమె మద్దతుతో
మనోజ్‌ ఎంత శ్రమించాలో అంతగా శ్రమించాడు.

పేద కుటుంబం కాబట్టి, తన ఖర్చులకు డబ్బులు సంపాదించుకోడానికి టెంపో నడిపాడు. రాత్రివేళల్లో యాచకులతో కలిసి నిద్రించిన సందర్భాలూ ఉన్నాయి. కానీ, మొదటి మూడు ప్రయత్నాల్లోనూ పరాజయం వెక్కిరించింది. చివరిదైన నాలుగో ప్రయత్నంలో విజయాన్ని ముద్దాడాడు. 121వ ర్యాంకు సాధించి ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌కు ఎంపికయ్యాడు. 

మహారాష్ట్ర కేడర్‌లో ఉద్యోగంలో చేరాడు. ఇప్పుడు ముంబయి పోలీస్‌ విభాగంలో అడిషనల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన దూకుడును చూసి తోటి అధికారులు, పోలీసులు ఆయనను సింగం, సింబా అని ముద్దుగా పిలుచుకుంటారు. ఉద్యోగం సాధించిన తర్వాత మనోజ్‌ తన ప్రేయసి శ్రద్ధా జోషిని సగర్వంగా పెళ్లాడాడు. ఆమె కూడా మనోజ్‌ సహకారంతో సివిల్స్‌కు సిద్ధమైంది. మంచి ర్యాంకు సాధించింది. ప్రస్తుతం, ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ (ఐఆర్‌ఎస్‌) అధికారిగా సేవలందిస్తున్నది. ఆ జంట జీవన ప్రయాణం గురించి ‘12th Fail: హరా వహీ జో లడా నహీ’ (12వ తరగతి ఫెయిల్‌: పోరాడని వాళ్లే ఓడిపోతారు) పేరుతో అనురాగ్‌ పాఠక్‌ ఓ పుస్తకం కూడా రాశారు. అన్నట్టు, ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేస్తున్నారు.

☛ Sirisha, SI : న‌న్ను ఆఫ్‌ట్రాల్ కానిస్టేబుల్ అన్న ఆ ఎస్పీతోనే..

#Tags