Inspirational IAS Success Story : ఓటమి.. ఓటమి.. కానీ చివరికి ఐపీఎస్.. ఐఏఎస్ రెండు కొట్టానిలా..
ఈమె ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లా కర్ణప్రయాగ్ చెందిన ముద్ర గైరోలా. ఈ నేపథ్యంలో ముద్ర గైరోలా సక్సెస్ స్టోరీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
ముద్ర గైరోలా.. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లా కర్ణప్రయాగ్ నివాసి. ప్రస్తుతం ఆమె కుటుంబం ఢిల్లీలో నివసిస్తోంది.
ఎడ్యుకేషన్ :
ముద్ర గైరోలా.. చిన్నప్పటి నుంచి చదువుల్లో టాపర్. ఈమె 10వ తరగతిలో 96% మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. అలాగే 12వ తరగతి పరీక్షల్లో 97% మార్కులతో పాస్ అయ్యారు. ఆమెకు పాఠశాలలో భారతదేశపు మొదటి మహిళా IPS కిరణ్ బేడీ అవార్డు లభించింది. 12వ తరగతి ఉత్తీర్ణులైన తర్వాత ముంబైలోని మెడికల్ కాలేజీలో డెంటల్‌లో అడ్మిషన్ తీసుకుంది. అలాగే బీడీఎస్‌లో బంగారు పతకం కూడా సాధించింది. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఢిల్లీకి వచ్చి ఎండీఎస్‌లో చేరింది. అయితే ఎండీఎస్ చదువును మధ్యలోనే వదిలేసి యూపీఎస్సీ సివిల్స్ ప్రిపరేషన్‌లో పూర్తిగా నిమగ్నమైంది.
చివరికి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యానిలా..
2018 సంవత్సరంలో ఆమె మొదటిసారిగా యూపీఎస్సీ(UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్షను రాసింది. ఈమె ఇంటర్వ్యూ రౌండ్‌కు చేరుకుంది. 2019లో మరోసారి UPSC ఇంటర్వ్యూ ఇచ్చారు. ఒక్కసారి కూడా తుది ఎంపిక జరగలేదు. దీని తరువాత 2020లో ఆమె మెయిన్స్ పరీక్షలో ఛేదించలేకపోయింది.
మరోసారి 2021 సంవత్సరంలో UPSC పరీక్షను ఇచ్చింది. ఈసారి ఆమె కష్టానికి ఫలితం దక్కడంతో UPSCలో 165వ ర్యాంక్‌తో ఉత్తీర్ణత సాధించి IPS అయింది. కానీ ఆమె ఐఏఎస్ కంటే తక్కువ దేనినీ అంగీకరించలేదు. ఆమె 2022 సంవత్సరంలో 53వ ర్యాంక్‌తో UPSC క్లియర్ చేసి IAS ఉద్యోగం కొట్టింది. పట్టిన పట్టు వదలకుండా చివరికి తను అనుకున్న లక్ష్యం ఐఏఎస్ కొట్టింది.
నేను సాధించలేనిది.. నా కుతురు..
ముద్ర గైరోలా.. తండ్రి అరుణ్ కూడా సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్ కావాలనుకున్నాడు. 1973లో యూపీఎస్సీ పరీక్ష రాశారు. ఆ సమయంలో అతను ఇంటర్వ్యూలో విజయం సాధించలేకపోయాడు. తన నెరవేరని కల కూతురు ద్వారా నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశాడు.