Parliament Sessions: జులై 29 పార్లమెంట్‌ సమావేశాల అప్‌డేట్స్‌

  • రావూస్‌  సివిల్స్‌ సెంటర్‌  ప్రమాదంపై కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ లోక్‌సభలో మాట్లాడారు. ఈ ఘటన జరగటం చాలా  విషాదకరం.
  • ఒక తెలివైన అభ్యర్థి సివిల్స్‌ సాధించి దేశానికి సేవ చేయాలనే  ఉద్దేశంతో  ఇక్కడి వస్తారు. అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు చాలా కలలు కంటారు. కానీ, ఇలాంటి ఘటనలు వారి హృదాయాన్ని ముక్కలు చేస్తాయి. 
  • నష్టపరిహాం ఇచ్చే విషయమే అయినా.. ఎంత నష్టం పరిహారం ఇచ్చినా అభ్యర్థులు కోల్పోయిన జీవితానికి తిరిగి  ఇవ్వలేం. ఇటవంటి ఘటనలు జరగకుండా పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. భవనం కోడ్‌లు, అగ్నిమాపక భద్రత, వరద భద్రత వంటి విషయాల్లో ప్రాథమిక నిబంధనల ఉల్లంఘిస్తున్నారు.
     
  • రావూస్‌  సివిల్స్‌ సెంటర్‌  ప్రమాదంపై  ఎంపీ అఖిలేష్‌ యాదవ్‌ లోక్‌సభలో మాట్లాడారు. 
  • ఈ ఘటన జరగటం చాలా బాధాకరం. ఈ ఘటనకు ప్లాన్‌, ఎన్‌ఓసీ ఇచ్చిన అధికారులే బాధ్యత వహించాలి. దీనంతటికీ అసలు ఎవరు బాధ్యత వహిస్తారు. అధికారులుపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలి. 
  • ఇది కేవలం ఒకే అక్రమం భవనం కాదు. యూపీలో అక్రమ భవనాలను బుల్డోజర్‌తో కూల్చటం చూస్తున్నాం. అయితే ఈ ప్రభుత్వం ఢిల్లీలో బుల్‌డోజర్‌తో చర్యలు చేపడుతుందా? లేదా?అని ప్రశ్నించారు.
  • ఢిల్లీ రావూస్‌ కోచింగ్‌ సెంటర్‌ ఘటనపై లోక్‌సభలో బీజేపీ ఎంపీ భానుశ్రీ స్వరాజ్‌ మాట్లాడారు. 
  • సివిల్స్‌ ప్రివేర్‌ అవుదామని ఢిల్లీకి వచ్చిన  అభ్యర్థుల మృతికి ఢిల్లీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం.  
  •  
  • ఆమ్‌ ఆద్మీ పార్టీ పాలన యంత్రాంగం నిర్లక్ష్యంతో ముగ్గురు అభ్యర్థులు  మృతి చెందారు. 
  • వరదల విషయంలో రాజేంద్ర నగర్‌ ప్రాంత ప్రజలు  ఎన్నొసార్లు స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన ఆయన చర్యలు తీసుకోలేదు. ఈ ఘటనపై హోం మంత్రిత్వ శాఖ ఓ  కమిటి ఏర్పాటు చేసిన దర్యాప్తు చేయలని కోరుతున్నా.
     

 

  • రాజ్యసభలో చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ మాట్లాడారు. 
  • నాకు రూల్ 267 కింద నోటీసులు అందాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఢిల్లీలో సివిల్స్‌ ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల విషాద మరణంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
  • ‘‘కోచింగ్‌ సెంటర్లు పూర్తిగా వ్యాపారమయంగా మారిపోయాయి. ఎప్పుడు న్యూస్‌ పేపర్‌ చదువుదామని తెరిచినా రెండు పేజీలు ఈ సంస్థల ప్రకటనలే ఉంటాయి. ఈ అంశంపై సభలో స్వల్పకాలిక చర్చ సముచితమని భావిస్తున్నాం. దీనిపై అన్ని పక్షాలతో కలిపి ఇన్‌ఛాంబర్‌ మీటింగ్‌ ఏర్పాటుచేయాలి’’ అని ధన్‌ఖడ్‌ అన్నారు. 
  • రాజ్యసభలో శివసేన(యూబీటీ) పార్టీ ఎంపీ ప్రియాంకా చతుర్వేదీ నోటీసులు  ఇచ్చారు. మహారాష్ట్రలోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో అవినీతి ఆరోపణలు ఉన్నట్లు పేర్కొన్నారు.
  • ఢిల్లీ రావూస్‌ ఘటనపై దద్దరిల్లనున్న పార్లమెంట్‌
  • కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ అమర్ సింగ్‌ లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఢిల్లీ కోచింగ్ సెంటర్‌ ఘటనకు కేంద్రమే బాధ్యత వహించాలని, సభలో వివరణ ఇవ్వాలని కోరారాయన. 
  • ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో జమ్ము కశ్మీర్‌ అప్రోప్రియేషన్ (నం 3) బిల్లును ఇవాళ ప్రవేశపెట్టనున్నారు.
  • కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. చైనాతో సరిహద్దు పరిస్థితి, భారీ వాణిజ్య లోటుపై చర్చను డిమాండ్ చేశారు.
  • నేడు లోక్‌సభ, రాజ్యసభ బడ్జెట్‌పై చర్చ కొనసాగనుంది. 
  • జూలై 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25పై చర్చలో ఇవాళ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ప్రసంగించనున్నారు. 
  • జూలై 22న ప్రారంభమైన పార్లమెంట్‌ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయి.
#Tags