Free Civils Coaching: 23 వరకు ఉచిత శిక్షణ దరఖాస్తు గడువు... ఇలా అప్లై చేసుకోండి!
23 వరకు సివిల్స్ పరీక్షల కోసం ఉచిత శిక్షణ దరఖాస్తు గడువు.
న్యూశాయంపేట: తెలంగాణ రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్, మైనార్టీ సంక్షేమ శాఖ, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో సివిల్స్ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అందించనున్నట్లు హనుమకొండ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి మేన శ్రీను శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈనెల 23 వరకు దరఖాస్తుల గడువు పొడిగించినట్లు ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులు దరఖాస్తులను www.cet. cgg.gov.in//tmreis వెబ్‌సైట్‌లో సమర్పించాలని తెలిపారు.
మరిన్ని వివరాలకు హనుమకొండ సుబేదారి కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో రెండో అంతస్తులోని జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కార్యాలయంలో గానీ, 040–23236112 నంబర్లలో గానీ సంప్రదించాలని సూచించారు.
#Tags