Indian Navy Jobs 2024 : ఇండియన్ నేవీలో 741 పోస్టులు.. అర్హ‌త‌లు.. ద‌ర‌ఖాస్తు వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇండియన్ నేవీ 741 ఉద్యోగా భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. ఈ ఉద్యోగాల‌కు ఆగస్టు 2వ తేదీ వరకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చును. దీని ద్వారా గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో మొత్తం 741 ఖాళీలను భర్తీచేయనున్నారు.

ఇందులో ఛార్జ్‌మ్యాన్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ఫైర్‌మ్యాన్, మల్టీటాస్కింగ్ స్టాఫ్, సైంటిఫిక్ అసిస్టెంట్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్, ట్రేడ్స్‌మ్యాన్ మేట్, పెస్ట్ కంట్రోల్ వర్కర్, కుక్ పోస్టులను భర్తీచేయనున్నారు. 

➤ Agniveer Vayu Notification : అగ్నివీర్‌–వాయు 2/2025 నోటిఫికేషన్‌ విడుదల.. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నిపథ్‌ స్కీమ్‌

ద‌ర‌ఖాస్తు ఫీజు.. : 
ఈ పోస్టుల‌కు దరఖాస్తు ఫీజుగా రూ.295 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

అర్హ‌త‌లు ఇవే.. :
పోస్టుల వారీగా 10వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తుల పరిశీలన ఆధారంగా ఎంపికచేసిన అభ్యర్థులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించిన తుది ఎంపికలు చేపడతారు.

పోస్టుల వివ‌రాలు ఇవే.. : 
మొత్తం 741 ఉద్యోగాలు. ఫైర్‌మెన్ 444, ట్రేడ్స్‌మెన్ మేట్ 161, ఫైర్ ఇంజిన్ డ్రైవర్ 58, ఛార్జ్‌మెన్ 29 పోస్టులున్నాయి. టెన్త్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారు అర్హులు.

వయోపరిమితి :
సైంటిఫిక్ అసిస్టెంట్, ఛార్జ్‌మ్యాన్ (మెకానిక్) పోస్టులకు అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లకు మించకూడదు. ఫైర్‌మ్యాన్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్ పోస్టులకు అభ్యర్థుల వయస్సు 18-27 ఏళ్లలోపు ఉండాలి. మిగిలిన అన్ని పోస్టులకు అభ్యర్థుల వయస్సు 18-25 ఏళ్లలోపు ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్లు; దివ్యాంగులకు 10 ఏళ్లు; ఎస్టీ, ఎస్సీలకు 5 ఏళ్లు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

ఈ నేవీ రిక్రూట్​మెంట్​లో సెలెక్ట్​ అయినవారు ఛార్జ్‌మ్యాన్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ట్రేడ్స్‌మ్యాన్ మేట్‌, ఫైర్‌మ్యాన్ హోదాతో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇవన్నీ సాంకేతిక సేవలకు చెందిన ఉద్యోగాలే. 

అభ్యర్థులకు రాత పరీక్ష, వైద్య పరీక్షలు చేసి, అర్హులను ఉద్యోగంలోకి తీసుకుంటారు. దేశంలో ఉన్న నేవీ కేంద్రాల్లో వీరు తమ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. 

పూర్తి వివ‌రాలు ఇవే..
పరీక్ష పేరు : ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐఎన్‌సెట్‌-01/2024)

1. జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ ‘బి (ఎన్‌జీ)’, నాన్ గెజిటెడ్, ఇండస్ట్రియల్, నాన్ మినిస్టీరియల్

ఖాళీల సంఖ్య: 33
➤ ఛార్జ్‌మ్యాన్ (అమ్యూనిషన్‌ వర్క్‌షాప్): 01 పోస్టు
➤ ఛార్జ్‌మ్యాన్ (ఫ్యాక్టరీ): 10 పోస్టులు
➤ ఛార్జ్‌మ్యాన్ (మెకానిక్): 18 పోస్టులు
➤ సైంటిఫిక్ అసిస్టెంట్: 04 పోస్టులు
➤ జీత భత్యాలు: నెలకు రూ.35,400-రూ.1,12,400.

2. జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ ‘సి’, నాన్ గెజిటెడ్, నాన్-ఇండస్ట్రియల్
ఖాళీల సంఖ్య: 708
➤ డ్రాఫ్ట్స్‌మ్యాన్ (కన్‌స్ట్రక్షన్‌): 02 పోస్టులు
జీత భత్యాలు: నెలకు రూ.25,500-రూ.81,100.
➤ ఫైర్‌మ్యాన్: 444 పోస్టులు
జీత భత్యాలు: రూ.19,900-రూ.63.200.
➤ ఫైర్ ఇంజిన్ డ్రైవర్: 58 పోస్టులు
జీత భత్యాలు: రూ.21,700-రూ.69,100.
➤ ట్రేడ్స్‌మ్యాన్ మేట్: 161 పోస్టులు
జీత భత్యాలు: రూ.18,000-రూ.56,900.
➤ పెస్ట్ కంట్రోల్ వర్కర్: 18 పోస్టులు
జీత భత్యాలు: రూ.18,000-రూ.56,900.
➤ కుక్: 09 పోస్టులు
జీత భత్యాలు: రూ.19,900-రూ.63,200.
➤ ఎంటీఎస్‌ (మినిస్టీరియల్): 16 పోస్టులు 
జీత భత్యాలు: రూ.18,000-రూ.56,900.

➤ MTS and Havaldar Posts : ఎంటీఎస్, హవాల్దార్‌ పోస్ట్‌లకు ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్‌.. 8,326 పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ!

#Tags