Skip to main content

రైల్వేలో గ్రూప్‌ C, గ్రూప్‌ D పోస్టులు భర్తీ ...అర్హత 10వ తరగతి

Railway Group jobs
Railway Group jobs

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుండి Scout & Guide Quota లో గ్రూపు C మరియు గ్రూప్ D ఉద్యోగాల భర్తీకి 10+2 / 10th + ITI పూర్తి చేసిన వారి నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు ఆన్లైన్ లో అక్టోబర్ 7వ తేది లోపు తమ అప్లికేషన్ చేరే విధముగా పోస్టు ద్వారా పంపించాలి.

తెలంగాణ గురుకులాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల: Click Here

ఈ ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి అప్లై చేయండి.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ: ఈస్టర్న్ రైల్వే (హాజీపూర్) నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.

భర్తీ చేస్తున్న పోస్టులు: ఈస్టర్న్ రైల్వేలో గ్రూప్ C మరియు గ్రూపు D ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.

అర్హతలు: కనీసం 50% మార్కులతో 10+2 అర్హత ఉండాలి (లేదా)10th పాస్ + ITI అర్హత ఉన్న వారు అప్లై చేయండి.

మొత్తం ఖాళీల సంఖ్య: ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

వయస్సు: 01-01-2025 నాటికి ఈ వయస్సు లెక్కిస్తారు.

గ్రూప్ C ఉద్యోగాలకు 18 నుండి 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
గ్రూప్ D ఉద్యోగాలకు 18 నుండి 33 సంవత్సరాలు వయస్సు ఉండాలి.

వయస్సులో సడలింపు వివరాలు: SC , ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు 

OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు 

PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు: 
GEN / OBC / EWS అభ్యర్థులకు ఫీజు – 500/-
SC, ST, PwBD, Female , Transgender అభ్యర్థులకు ఫీజు 250- 


జీతము:
గ్రూపు C ఉద్యోగాలకు ప్రారంభంలో 19,000/- జీతము తో పాటు ఇతర బెనిఫిట్స్ ఇస్తారు.
గ్రూపు D ఉద్యోగాలకు ప్రారంభంలో 18,000/- జీతము తో పాటు ఇతర బెనిఫిట్స్ ఇస్తారు.


అప్లికేషన్ ప్రారంభ తేదీ: ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారు సెప్టెంబర్ 7వ తేదీ నుండి అప్లై చేసుకోవచ్చు.

అప్లికేషన్ చివరి తేదీ: ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారు అప్లికేషన్ పంపుటకు చివరి తేది 07-10-2024

అప్లికేషన్ విధానం: అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లికేషన్ పోస్టు ద్వారా పంపించాలి.

ఎంపిక విధానం: ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష మరియు Scout & Guide Quota క్వాలిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా: General Manager (Personnel), Recruitment Section, E.C.Railway Head quarter Office, Hajipur , Distt-Vaishali. Bihar. PIN-844101
 

Published date : 18 Sep 2024 09:00PM
PDF

Photo Stories