కెరీర్ గైడెన్స్..జువాలజీ

జీవ శాస్త్రానికి చెందిన ప్రధాన విభాగం జువాలజీ. ప్రోటోజోవా, చేపలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు సహా అన్ని జంతువుల గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రమే జువాలజీ. ఈ క్రమంలో జీవులు- వర్గీకరణ, వాటి నిర్మాణం, లక్షణాలు, ప్రవర్తన, పోషణ, జన్యువులు, పరిణామక్రమం వంటి అంశాలు ఈ శాస్త్రంలో ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే జీవులు, వాటి మనుగడ గురించి సమగ్రంగా అధ్యయనం చేసే శాస్త్రమే జువాలజీ.

జువాలజీ నిష్ణాతులైన వారిని జువాలజిస్ట్‌లుగా వ్యవహరిస్తారు. జువాలజీలో చాలా ఉప విభాగాలు ఉంటాయి. వాటిల్లో కొన్ని..
  • పక్షుల అధ్యయనం-ఆర్నిథాలజీ
  • క్షీరదాల అధ్యయనం-మమ్మలోజి
  • చేపలు వాటి ఆవాసాల అధ్యయనం-ఇక్తాలాజీ
  • ఉభయచరాలు, సరీసపాల అధ్యయనం -హెర్పెటాలాజిస్ట్
విధులు:
ప్రోటోజోవా, చేపలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు సహా అన్ని జంతువులకు సంబంధించిన లక్షణాలు, వాటి అవాసాలు తదితర అంశాలపై నివేదికలు రూపొందించడం, వాటిని నిర్వహించడం, డీఎన్‌ఏ వంటి అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి పరిశోధనలు చేయడం, అంతరించి పోయిన జీవులకు సంబంధించిన డేటాను సేకరించడం, వాటిని పరిరక్షించడం వంటి విధులను జువాలజిస్ట్‌లు నిర్వహిస్తుంటారు.

అందుబాటులోని కోర్సులు:
జువాలజీకి సంబంధించి పలు రకాలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పదో తరగతి తర్వాత ఇంటర్మీడియెట్‌లో బైపీసీ (బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్) గ్రూపు తీసుకోవడం జువాలజీ సబ్జెక్ట్‌ను చదవచ్చు. ఆ తర్వాత ఉన్న అవకాశాలు..
  • బీఎస్సీ (జువాలజీ, పలు రకాల సబ్జెక్ట్ కాంబినేషన్స్‌తో)
  • ఎంఎస్సీ (జువాలజీ)
  • ఇంటిగ్రేటెడ్ పీహ్‌చ్‌డీ
  • పీహెచ్‌డీ (జువాలజీ)
  • ఎంఫిల్ (జువాలజీ)
మన రాష్ట్రంలో ఇంటర్మీడియెట్, బ్యాచిలర్, పీజీ, పీహెచ్‌డీ స్థాయిలో జువాలజీ కోర్సు అందుబాటులో ఉంది. అన్ని ప్రముఖ యూనివర్సిటీలు ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి.

అవకాశాలు:
జువాలజిస్ట్‌లకు.. జూ, వైల్డ్‌లైఫ్ సర్వీసెస్, బోటానికల్ గార్డెన్స్, నేచర్ రిజర్వ్స్, వివిధ పరిశోధన సంస్థలు, నేషనల్ పార్క్‌లు, యానిమల్ క్లినిక్స్, ఫిషరీస్, అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్, వెటర్నరీ హాస్పిటల్స్, మ్యూజియంలు, ఫార్మస్యుటికల్ కంపెనీలు కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో ఉండే

జాబ్ ప్రొఫైల్స్..
  1. జూ క్యురేటర్
  2. యానిమల్ బ్రీడర్స్
  3. ఎడ్యుకేటర్స్
  4. యానిమల్ ట్రెనర్స్
  5. బయాలాజికల్ లేబొరేటరీ టెక్నిషియన్
  6. యానిమల్ బీహెవీరియస్ట్
  7. రీహాబీలిటేటర్
  8. వైల్డ్ లైఫ్ బయాలాజిస్ట్
  9. రీసెర్చర్
  10. వెటర్నెరియన్
  11. ఫోర్సెనిక్ ఎక్స్‌పర్ట్
  12. జూ కీపర్
  13. కన్జర్విస్ట్
  14. అడ్మినిస్ట్రేటర్
  15. మేనేజర్
  16. ఎకలాజికల్ కన్సల్టెంట్
  17. సైన్స్, వైల్డ్‌లైఫ్ చానెల్స్‌లో వైల్డ్ లైఫ్ ఫిల్మ్ మేకర్‌గా కూడా అవకాశాలు ఉంటాయి.
  18. ఆసక్తి ఉంటే ఈ కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్‌లలో ఫ్యాకల్టీగా స్థిర పడొచ్చు.
వేతనాలు:
వేతనాల విషయానికొస్తే..పని చేస్తున్న ఆర్గనైజేషన్, హోదా ఆధారంగా వేతనాలు ఉంటాయి. కెరీర్ ప్రారంభంలో నెలకు రూ. 10 నుంచి 15 వేల వరకు అందుకోవచ్చు. ఐదేళ్ల అనుభవం ఉంటే నెలకు రూ. 25 వేల వరకు సంపాదించవచ్చు. టీచింగ్ రంగంలో కార్పొరేట్ స్కూల్స్/కాలేజీల్లో ప్రారంభంలో నెలకు రూ. 15 వేల వరకు అందుకోవచ్చు.

టాప్ ఇన్‌స్టిట్యూట్‌లు:
-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-బెంగళూరు
వెబ్‌సైట్: www.iisc.ernet.in

-ది వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా-డెహ్రాడూన్
వెబ్‌సైట్: https://envfor.nic.in

-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ-పుణే
వెబ్‌సైట్: www.niv.co.in

-ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్
వెబ్‌సైట్: www.osmania.ac.in

-ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in

-హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.uohyd.ac.in

-బెనారస్ హిందూ యూనివర్సిటీ-వారణాసి
వెబ్‌సైట్: www.bhu.ac.in

-ఢిల్లీ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.du.ac.in

-పుణే యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.unipune.ac.in

-కాకతీయ యూనివర్సిటీ-వరంగల్
వెబ్‌సైట్: www.kakatiya.ac.in





























#Tags