సాఫ్ట్‌వేర్ లోపాలను సరిదిద్దే.. ఐటీ టెస్టర్

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రాకతో నూతన ఉద్యోగావకాశాలు యువత తలుపు తడుతున్నాయి. వాటిలో ఒకటి ఐటీ టెస్టింగ్. సాఫ్ట్‌వేర్లలోని లోపాలను పసిగట్టి, వాటిని సరిచేయడమే ఐటీ టెస్టింగ్. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు ఈ రంగాన్ని ఎంచుకోవచ్చు. స్కిల్స్ పెంచుకుంటూ కష్టపడి పనిచేస్తే ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు. దేశ విదేశాల్లో మంచి అవకాశాలు, భారీ వేతనాలు అందుకొనేందుకు వీలు కల్పిస్తున్న నయా కెరీర్.. ఐటీ టెస్టింగ్.

నైపుణ్యం పెంచుకుంటే అధిక ఆదాయం
కంపెనీలు తమ కార్యకలాపాల కోసం కంప్యూటర్లలో ఎన్నో రకాల సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగిస్తుంటాయి. అవి సక్రమంగా పనిచేసినంత కాలం ఎలాంటి ఇబ్బంది ఉండదు. సాఫ్ట్‌వేర్లలో లోపాలు తలెత్తితే మాత్రం భారీ నష్టం జరుగుతుంది. ప్రధానంగా స్టాక్ ఎక్ఛేంజ్‌లు, బ్యాంకులు, విమానయాన సంస్థల్లో సాఫ్ట్‌వేర్‌లు సజావుగా పనిచేసేలా చూసేందుకు ఐటీ టెస్టర్లను నియమిస్తున్నారు. కార్పొరేట్ సంస్థల్లో వీరికి ఉద్యోగావకాశాలు దక్కుతున్నాయి. ఈ రంగంలో ప్రారంభంలో తక్కువ వేతనాలు ఉన్నా పరిజ్ఞానం, అనుభవం పెంచుకుంటే అధిక ఆదాయం ఆర్జించడానికి వీలుంటుంది.

ఐటీ టెస్టర్లకు భారీ డిమాండ్
ఐటీ టెస్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలంటే.. దీనికి సంబంధించిన టెక్నాలజీ, టూల్స్‌పై నాలెడ్జ్ పెంచుకోవాలి. దీంతోపాటు లాజికల్ అనాలిసిస్, డిడక్షన్, అబ్జర్వేషన్, రీజనింగ్, ప్లానింగ్, టీమ్ మేనేజ్‌మెంట్, కమ్యూనికేషన్ అండ్ రిపోర్టింగ్, ప్రజంటేషన్ స్కిల్స్‌ను అలవర్చుకోవాలి. ఫంక్షనల్ డొమైన్ నాలెడ్జ్, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి. సాఫ్ట్‌వేర్ క్వాలిటీ ఇంజనీరింగ్, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు కూడా అవసరం.

కొత్త కొత్త సాఫ్ట్‌వేర్‌లు తెరపైకి వస్తుండడంతో వాటి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. మనదేశంలో స్కిల్డ్ ఐటీ టెస్టర్లకు భారీ డిమాండ్ ఉందని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ అవసరాలకు తగినంత మంది టెస్టర్లు అందుబాటులో లేరని అంటున్నారు. ఐటీ టెస్టింగ్ రంగం వేగంగా వృద్ధి చెందుతోందని పేర్కొంటున్నారు. ఔత్సాహికులు ఇందులోకి నిరభ్యంతరంగా ప్రవేశించవచ్చని సూచిస్తున్నారు.

అర్హతలు: ఐటీ టెస్టింగ్‌లో స్పెషలైజ్డ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియెట్, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత వీటిలో చేరొచ్చు. ఐటీ టెస్టింగ్‌పై శిక్షణ పొందిన బీఎస్సీ, బీఈ, బీసీఏ విద్యార్థులను కంపెనీలు ఎక్కువగా నియమించుకుంటున్నాయి. సాఫ్ట్‌వేర్ అభ్యర్థులు టెక్నికల్, సాఫ్ట్ స్కిల్స్‌పై దృష్టి పెట్టాలి. ్డ

వేతనాలు: ట్రైనీ నుంచి డెరైక్టర్ వరకు వివిధ హోదాల్లో పనిచేసే ఐటీ టెస్టర్లకు వేర్వేరు వేతనాలు ఉంటాయి. టెస్ట్ ఇంజనీర్‌కు నెలకు రూ.8 వేల నుంచి రూ.13 వేలు, సీనియర్ టెస్ట్ ఇంజనీర్‌కు రూ.15 వేల నుంచి రూ.20 వేలు, టెస్ట్ లీడర్‌కు రూ.30 వేల నుంచి రూ.50 వేలు, టెస్ట్ ఆర్కిటెక్ట్‌కు రూ.50 వేల నుంచి రూ.75 వేలు, టెస్ట్ మేనేజర్‌కు రూ.75 వేల నుంచి రూ.లక్షన్నర, హెడ్ టెస్టింగ్‌కు రూ.లక్షన్నర నుంచి రూ.రెండున్నర లక్షల వేతనం అందుతుంది.

ఐటీ టెస్టింగ్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు
క్యూఏఐ గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్

వెబ్‌సైట్: www.qaiglobalinstitute.com
ఎడిస్టా టెస్టింగ్ ఇన్‌స్టిట్యూట్-బెంగళూరు
వెబ్‌సైట్:
www.edistatesting.com
అమిటీ సాఫ్ట్-చెన్నై
వెబ్‌సైట్:
www.amitysoft.com
సాఫ్ట్‌వేర్ క్వాలిటీ ఇంజనీరింగ్
వెబ్‌సైట్:
www.sqe.com

ఎన్నో రంగాల్లో అవకాశాలు
శ్రీరాబోయే రోజుల్లో సాఫ్ట్‌వేర్ రంగం మరింత విస్తరించనుంది. దేశ, విదేశాల్లోనూ మంచి కెరీర్ ఉన్న కోర్సు ఐటీ టెస్టింగ్. విద్య, వైద్యం, ఆరోగ్యం, ఫైనాన్స్ రంగాలతోపాటు ఐటీలోనూ ఐటీ టెస్టింగ్ నిపుణుల పాత్ర ఎంతో కీలకం. ఇది కెరీర్ పరంగా ఉన్నత స్థానానికి చేరేందుకు స్కోప్ ఉన్న కోర్సు. అయితే ప్రభుత్వ రంగంతో పోల్చితే ప్రైవేట్ రంగంలోనే అవకాశాలు అధికం. ఉద్యోగ అవకాశాలతోపాటు ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగేందుకు వీలుంది. ఆసక్తి ఉంటే స్నేహితులు, సహచరులతో కలిసి కన్సల్టెన్సీని ఏర్పాటు చేసుకోవచ్చ్ణు
- ఆర్.లక్ష్మణ్‌నాయక్, క్యాంపస్ ప్లేస్‌మెంట్ ఇన్‌ఛార్జి, ఆర్.జి.యు.కె.టి. వైఎస్సార్ కడప జిల్లా


















#Tags