Central Government Jobs: పదితోనే కేంద్ర కొలువు.. పూర్తి వివ‌రాలు ఇలా..

Govt Jobs: central government jobs with 10th class qualification

కేంద్ర పర్సనల్, పబ్లిక్‌ గ్రీవెన్సెస్, పెన్షన్స్‌ మంత్రిత్వశాఖ పర్సనల్‌ అండ్‌ ట్రెయినింగ్‌ విభాగానికి చెందిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ).. పలు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. పదోతరగతి విద్యార్హతతోనే ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్‌ 30 తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

  • ఎగ్జామ్‌: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ మల్టీటాస్కింగ్‌(నాన్‌ టెక్నికల్‌), హవల్దార్‌ స్టాఫ్‌ ఎగ్జామినేషన్‌ 2021. 
  • పోస్టుల సంఖ్య: మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌(నాన్‌ టెక్నికల్‌) పోస్టుల సంఖ్య తర్వాత వెల్లడిస్తారు. హవల్దార్‌ పోస్టుల సంఖ్య (సీబీఐసీ అండ్‌ సీబీఎన్‌)– 3603.


చదవండి: 10th Model Papers: టెన్త్ పేపర్ ఎలా ఉంటుంది?.. మోడల్ పేపర్లు ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోండిలా..
 

ఎవరు అర్హులు

  • ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్‌ (పదోతరగతి) లేదా తత్సమాన విద్యార్హత పూర్తిచేసి ఉండాలి.
  • వయసు: ఆయా విభాగాలను అనుసరించి 01.01.2022 నాటికి 18–25, 18–27ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. ఎస్సీ,ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
  • ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ రాత పరీక్ష (పేపర్‌–1, పేపర్‌–2), ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌(పీఈటీ)/ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (పీఎస్‌టీ) ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
  • పీఈటీ(వాకింగ్‌): ఈ టెస్టుల్లో భాగంగా పురుష అభ్యర్థులు 1600 మీటర్ల దూరాన్ని 15 నిమిషాల్లో నడవాలి.
  • పీఈటీ(సైక్లింగ్‌): ఈ టెస్టులో భాగంగా 8 కిలోమీటర్ల దూరాన్ని 30 నిమిషాల్లో పూర్తిచేయాలి. మహిళా అభ్యర్థులు 3 కిలోమీటర్లను 25 నిమిషాల్లో పూర్తిచేయాలి.
  • పీఎస్‌టీ: ఎత్తు విషయంలో పురుష అభ్యర్థులు 157.5 సె.మీ ఎత్తు ఉండాలి. అలాగే మహిళా అ భ్యర్థులు 152 సె.మీ ఉంటే సరిపోతుంది. ఛాతీ 76 సెం.మీ ఉండాలి. ఎత్తుకు తగిన బరువు ఉండాలి.

పరీక్ష ఇలా
ఈ పరీక్షలో మొత్తం రెండు పేపర్లుంటాయి. పేపర్‌–1 ఆబ్జెక్టివ్‌ టైప్, పేపర్‌–2 పరీక్ష డిస్క్రిప్టివ్‌ టైప్‌లో నిర్వహిస్తారు. 

పేపర్‌–1

  • ఈ పరీక్ష ఆన్‌లైన్‌(కంప్యూటర్‌ బేస్డ్‌టెస్ట్‌) విధానంలో 100 మార్కులకు 100 ప్రశ్నలకు ఉంటుంది. ఇందులో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అవి.. జనరల్‌ ఇంగ్లిష్‌ 25 ప్రశ్నలు–25 మార్కులు, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ 25 ప్రశ్నలు– 25 మార్కులు, న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌ 25 ప్రశ్నలు– 25 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగం నుంచి 25 ప్రశ్నలు–25 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 90 నిమిషాలు ఉంటుంది. 

పేపర్‌–2

  • ఈ పరీక్ష మొత్తం 50 మార్కులకు ఆఫ్‌లైన్‌లో డిస్క్రిప్టివ్‌ పద్దతిలో ఉంటుంది. షార్ట్‌ ఎస్సే/లెటర్‌ ఇన్‌ ఇంగ్లిష్‌ రాయాల్సి ఉంటుంది. పరీక్ష సమయం 45 నిమిషాలు ఉంటుంది. 


చదవండి: 

పదో తరగతి స్డడీ మెటీరియల్‌

పదో తరగతి బిట్‌బ్యాంక్

పదో తరగతి సిలబస్

పదో తరగతి మోడల్ పేపర్లు

పదో తరగతి ప్రివియస్‌ పేపర్స్

పదో తరగతి టెక్స్ట్ బుక్స్

మోడల్ పేపర్లు కోసం క్లిక్ చేయండి


సిలబస్‌

  • ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌: రీడింగ్‌ కాంప్రహెన్షన్, ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్, స్పెల్లింగ్స్, ఇడియమ్స్, సినానిమ్స్‌ అండ్‌ అంటానిమ్స్, వన్‌ వర్డ్‌ సబ్‌స్టిట్యూషన్, సెంటెన్స్‌ కరెక్షన్, ఎర్రర్‌ స్పాటింగ్‌.
  • రీజనింగ్‌: క్లాసిఫికేషన్, అనాలజీ, కోడింగ్‌–ఢికోడింగ్,మాట్రిక్స్, వర్డ్‌ ఫార్మేషన్,వెన్‌ డయాగ్రమ్, డైరెక్షన్‌/డిస్టెన్స్, బ్లడ్‌ రిలేషన్,మిస్సింగ్‌ నంబర్స్, నాన్‌ వెర్బల్‌ రీజనింగ్, వెర్బల్‌ రీజనింగ్‌.
  • న్యూమరికల్‌ ఎబిలిటీ: సింప్లిఫికేషన్, ఇంటరెస్ట్, పర్సంటేజ్,రేషియో అండ్‌ ప్రపోర్షన్, యావరేజ్, ప్రాబ్లమ్స్‌ అండ్‌ ఏజెస్, స్పీడ్, డిస్టెన్స్‌ అండ్‌ టైమ్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, నంబర్‌ సిరీస్, నంబర్‌ సిస్టమ్, మెన్సురేషన్, టైమ్‌ అండ్‌ వర్క్, మిక్చర్‌ ప్రాబ్లమ్, ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ.
  • జనరల్‌ అవేర్‌నెస్‌: స్టాటిక్‌ జీకే, సైన్స్, బుక్స్‌ అండ్‌ ఆథర్స్, కరెంట్‌ అఫైర్స్, డేట్స్‌ అండ్‌ పోర్ట్‌ పోలియోస్‌

వేతనాలు

  • పే బాండ్‌ 1 ప్రకారం– ఎంటీఎస్‌ ఉద్యోగులు నెలకు రూ.18,000–22,000 వరకు వేతనంగా పొందుతారు. ఇవే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా పొందే అవకాశం ఉంటుంది.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరి తేదీ: 30.04.2022
  • ఫీజు చెల్లింపుకు ఆఖరు తేదీ: 02.05.2022
  • చలాన ద్వారా ఫీజు చెల్లింపు తేదీ: 03.05.2022
  • సీబీటీ (పేపర్‌–1) పరీక్ష తేదీ: జూలై, 2022
  • డిస్క్రిప్టివ్‌(పేపర్‌–2) పరీక్షతేదీ: త్వరలో వెల్లడిస్తారు.
  • వెబ్‌సైట్‌: https://ssc.nic.in

చదవండి: After 10th : పదో తరగతి అర్హతతో డ్రోన్‌ పైలట్‌.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు..

#Tags