Union Budget: ‘ఉద్యోగ కల్పన.. నైపుణ్య శిక్షణ‌’.. యువతకు రూ.2 లక్షల కోట్లు..

కేంద్ర ఆర్థిక బడ్జెట్‌ 2024–25లో ఈ సారి ఉద్యోగ కల్పన, నైపుణ్య శిక్షణపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది.

మొత్తం 4.1 కోట్ల మంది యువతను లక్ష్యంగా చేసుకొని దాదాపు రూ.2 లక్షల కోట్లను బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కేటాయించారు. ఇందులో రూ.1.48 లక్షల కోట్లను విద్య, ఉద్యోగాల కల్పన, నైపుణ్యా భివృద్ధి స్కీమ్‌ కోసం కేటాయించనున్నట్లు తెలిపారు. ఉద్యోగాల కల్పన కోసం మూడు పథకాలను, నైపుణ్యాల అభివృద్ధి కోసం పలు ప్రోత్సాహక కార్యక్రమాలను చేపట్టనున్నట్టు వెల్లడించారు. కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే సంస్థలకు, కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి ప్రయోజ నాలను కల్పిస్తామని ప్రకటించారు. ఈపీఎఫ్‌ఓలో నమోదయ్యే వివరాల ఆధారంగా వీటిని అమలు చేస్తామన్నారు.

ఉద్యోగ ప్రోత్సాహకం..
తమ ప్రభుత్వం నిర్దేశించుకున్న తొమ్మిది అత్యంత ప్రాధాన్య అంశాల్లో ‘ఉద్యోగ కల్పన, నైపుణ్య శిక్షణ’ ఒకటని తెలిపారు. వ్యవస్థీకృత రంగాల్లో కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి ప్రోత్సాహకంగా ఒక నెల వేతనం చెల్లిస్తారు. మూడు వాయిదాల్లో.. గరిష్టంగా రూ.15 వేల వరకు అందిస్తారు. దీంతో వచ్చే ఐదేళ్లలో 2.1 కోట్ల మందికి లబ్ధి కలుగుతుందని అంచనా.

మూడు వేల పీఎఫ్‌ రీయింబర్స్‌..
కంపెనీలు కొత్తగా/అదనంగా ఇచ్చే ఉద్యోగాలకు సంబంధించి యాజమాన్య వాటాగా చెల్లించే ఈపీఎఫ్‌ చందాల రీయింబర్స్‌మెంట్‌ చేస్తారు. నెలకు గరిష్టంగా రూ.3 వేల చొప్పున రెండేళ్లపాటు చెల్లిస్తారు. దీనితో కొత్తగా 50 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా. ఈ మూడు స్కీ మ్‌లను గరిష్టంగా నెలకు రూ.లక్ష వేతనమిచ్చే ఉద్యోగాలు/ఉద్యోగులకు మాత్రమే వర్తింపజేస్తారు.

Union Budget 2024-25: కేంద్ర బడ్జెట్‌ 2024-25.. పూర్తి వివ‌రాలు ఇవే..

నైపుణ్యాల కార్యక్రమాలు..
వచ్చే ఐదేళ్లలో 20 లక్షల మంది యువతలో నైపుణ్యాల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేప డుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 1,000 పారిశ్రామిక శిక్షణ ఇన్‌స్టి ట్యూట్లను అప్‌గ్రెడేషన్‌ చేస్తారు. పరిశ్రమలు, కంపెనీల అవసరాలకు తగినట్టుగా ఉండేలా కోర్సుల రూపకల్పనకు చర్యలు చేపడతారు. ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం కోసం పరిశ్ర మలు, కంపెనీల సహకారంతో వర్కింగ్‌ విమెన్‌ హాస్టళ్లు, పిల్లల సంరక్షణను చూసుకునే క్రెచ్‌ల ఏర్పాటుకు నిర్ణయించారు. 

పది లక్షల విద్యా రుణం..
దేశంలోని విద్యా సంస్థల్లో ఉన్నత చదువుల కోసం రూ.10 లక్షల వరకు విద్యా రుణాలపై ఆర్థిక సహాయం అందజేస్తారు. దీనికింద ఏటా లక్ష మంది విద్యార్థులకు మూడు శాతం వడ్డీ రాయితీ ఇచ్చే రూ.లక్ష విలువైన ఈ వోచర్లను అందజేస్తారు.

Union Budget: బడ్జెట్ ఎఫెక్ట్.. పెర‌గ‌నున్న, త‌గ్గ‌నున్న ధ‌ర‌లు ఇవే..

#Tags