Bank Jobs: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 896 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. లాస్ట్‌ డేట్‌ ఇదే

Bank Jobs IBPS Recruitment 2024 IBPS Notification 2024

బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్‌ అవుతున్న వారికి గుడ్‌న్యూస్‌. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌(ఐబీపీఎస్‌) తాజాగా ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా 896 ‍స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పదకొండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో(బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ బ్యాంక్, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్ధులు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. 

Telangana Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలోనే మూడు వేల పోస్టుల భర్తీ

మొత్తం పోస్టులు: 896
అర్హత: పోస్టులను అనుసరించి బీఈ, బీటెక్‌,మేనేజ్‌మెంట్, లా తదితర ప్రొఫెషనల్‌ కోర్సుల ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు.

వయసు: అన్ని పోస్ట్‌లకు 01.08.2024 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది..

NEET UG 2024: మరో రెండు రోజుల్లో నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌.. అక్కడ సీటు కావాలంటే భారీగా ఫీజు

మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ
స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్ట్‌ల భర్తీకి ఐబీపీఎస్‌ మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహించనుంది. అవి.. ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామినేషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ. ప్రిలిమినరీ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతుంది. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ మినహా మిగతా విభాగాలకు ఇంగ్లిష్‌ లేదా హిందీ మీడియంలలో హాజరుకావచ్చు.

ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: ఆగస్టు 21,2024
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.ibps.in/

#Tags