Skip to main content

Central Bank of India: సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఖాళీలు.. అప్లికేషన్‌కు చివరి తేదీ ఎప్పుడంటే

3000 Vacancies  Central Bank of India  Apprentice Job Opportunity  Eligibility Criteria Checklist

ముంబైలోని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో దేశవ్యాప్తంగా వివిధ రీజియన్లలో మొత్తం 3000 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి. 
వయస్సు: 01.04.1996 నుంచి 31.03.2004 మధ్య జన్మించి ఉండాలి.  
స్లైఫండ్‌: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 15,000/ చెల్లిస్తారు. 

అప్లికేషన్‌ ఫీజు: రూ. 800/ చెల్లించాల్సి ఉంటుంది.EWS,ఎస్సీ/ఎస్టీ, మహిళలు రూ. 600 చెల్లించాల్సి ఉంటుంది. వికలాంగులు రూ. 400 చెల్లించాల్సి ఉంటుంది. 

AP EAMCET Results 2024: నేడే ఏపీ ఎంసెట్‌ ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో ఇలా చెక్‌ చేసుకోండి


ఎంపిక విధానం: రాత పరీక్షలో సాధించిన స్కోర్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులకు స్థానిక భాషై పట్టు ఉండాలి. దీనికి సంబంధించి ఓ సర్టిఫికేట్‌ను కూడా సబ్‌మిట్‌ చేయాల్సి ఉంటుంది. 

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తుకు చివరి తేది: జూన్‌ 17, 2024 

Published date : 11 Jun 2024 01:15PM

Photo Stories