Arrangements for APPSC Exams: ఏపీపీఎస్సీ ప‌రీక్ష‌లు నిర్వాహ‌ణ‌

ప‌రీక్ష‌లు సాఫీగా జ‌ర‌గాల‌ని, ఎటువంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా నిర్వ‌హించాల‌ని అధికారులు ప‌క‌డ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్ల వివ‌రాల‌ను తెలిపేందుకు కలెక్టరేట్‌లో స‌మావేశం అయ్యారు. ప‌రీక్ష‌ల నిర్వాహ‌ణ గురించి వివ‌రాల‌ను తెలుసుకుందాం..
APPSC Exams arrangements meeting

సాక్షి ఎడ్యుకేష‌న్: ఏపీపీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్‌ఓ పెంచల కిషోర్‌ ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ సోమవారం నుంచి అక్టోబర్‌ 6 వరకు (అక్టోబర్‌ 2న మినహా) 7 రోజులపాటు పరీక్షలు సాగనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని 3 కేంద్రాల్లో రెండు షెషన్లుగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు.

TSPSC Group 1 : Group 1 Prelims ర‌ద్దు.. ఇప్పుడు అభ్య‌ర్థుల ప‌రిస్థితి ఏమిటి..?

మొత్తం 3,363 మంది పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా రవాణా సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. సమీక్షలో విద్యుత్‌ శాఖ అధికారి ప్రభాకర్‌, ఆర్టీసీ అధికారి సత్యనారాయణ, వైద్యశాఖ నుంచి డాక్టర్‌ ప్రకాష్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్‌ఐ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

#Tags