AP TET 2024 Exams : ఏపీ టెట్‌-2024 ప‌రీక్ష‌కు ప‌టిష్ట ఏర్పాట్లు.. అభ్య‌ర్థుల‌కు ఇబ్బందులు త‌లెత్త‌కుండా చ‌ర్య‌లు..

టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌)–2024కు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌ మీనా అధికారులను ఆదేశించారు.

కాకినాడ సిటీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌)–2024కు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌ మీనా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌–2024కు సంబంధించి ఏర్పాట్లపై జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌మీనా, రెవెన్యూ, పాఠశాల విద్యాశాఖ, పోలీస్‌, వైద్య ఆరోగ్యం, ప్రజా రవాణా, విద్యుత్‌ తదితర శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్‌ 3 నుంచి 21వ తేదీ వరకు ఉపాధ్యాయ అర్హత పరీక్షను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు.

Swachhta Hee Seva : ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠ‌శాల‌లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం

ఆన్‌లైన్‌లో నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిమిత్తం కాకినాడ జిల్లాలో నాలుగు కంప్యూటర్‌ సెంటర్లలో ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు రెండు సెషన్స్‌లో జరిగే టెట్‌కు 21,471 మంది అభ్యర్థులు హాజరుకానున్నరన్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసే అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

ఈ పరీక్ష నిర్వహణకు నలుగురు విద్యాశాఖ అధికారులు, నలుగురు డిపార్టుమెంట్‌ అధికారులను, ఒక ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ను నియమించామన్నారు. ఆయా సెంటర్లలో వికలాంగులకు సంబంధించి 27 మంది స్కయిబ్‌లను నియమించినట్లు తెలిపారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి లేటెస్ట్‌ ఫొటో, గుర్తింపుకార్డుతో హాజరుకావాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి డి తిప్పేనాయక్‌, పాఠశాల విద్య, వైద్య ఆరోగ్యం, ప్రజారవాణా, విద్యుత్‌ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags