AP TET 2024 Notification : ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష విధానాలు, ఎంపిక ఇలా..
దీంతో బీఈడీ, డీఈడీ తదితర ఉపాధ్యాయ విద్య కోర్సులు పూర్తి చేసిన వారు టెట్‌కు సన్నద్ధత ప్రారంభించారు. టెట్‌లో ఉత్తీర్ణత సాధిస్తేనే.. డీఎస్సీకి అర్హత లభిస్తుంది. టెట్ స్కోర్‌కు జీవిత కాల గుర్తింపు ఉంటుంది. ఈ నేపథ్యంలో.. ఏపీ టెట్ పరీక్ష విధానం, సిలబస్ అంశాలు, ప్రిపరేషన్ తదితర వివరాలు..
➨ అక్టోబర్ 3 నుంచి టెట్ పరీక్షలు
టెట్.. నాలుగు పేపర్లు
➨ ఏపీ టెట్‌ను పేపర్–1ఎ,1బి,పేపర్–2ఎ, 2బిల పేరుతో మొత్తం నాలుగు పేపర్లుగా నిర్వహిస్తారు. బోధన తరగతుల వారీగా అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించాల్సిన విధంగా ఈ పేపర్లను వర్గీకరించారు.
➨ పేపర్–1ఎ: 1–5వ తరగతి వరకు ఉపాధ్యాయులకు అవసరమైన పరీక్ష.
➨ పేపర్–1బి: 1–5వ తరగతి వరకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్‌కు అవసరమైన పరీక్ష.
➨ పేపర్–2ఎ: 6 నుంచి 8వ తరగతి వరకు స్కూల్ అసిస్టెంట్‌గా బోధించాలనుకునే వారు ఉత్తీర్ణత సాధించాల్సిన పేపర్.
➨ పేపర్–2బి: 6 నుంచి 8వ వరకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్‌గా బోధించాలనుకునే వారు హాజరు కావల్సిన పరీక్ష.
Jobs in Sports Quota : ఎస్‌బీఐ స్పోర్స్ కోటాలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు..
అర్హతలివే
పేపర్‌ను బట్టి ఇంటర్మీడియెట్, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీతోపాటు డీఈడీ/ బీఈడీ/లాంగ్వేజ్ పండిట్ తత్సమాన అర్హతలు ఉండాలి. ప్రస్తుత విద్యాసంవత్సరం చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులూ దరఖాస్తుకు అర్హులే.
పరీక్ష విధానాలు
➨ పేపర్–1ఎ, 1బి: పేపర్–1ఎ,పేపర్–1బిలను 5 విభాగాల్లో 150 మార్కులకు నిర్వహిస్తారు. చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజి; లాంగ్వేజ్–1, లాంగ్వేజ్–2 (ఇంగ్లిష్), మ్యాథమెటిక్స్; ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ సబ్జెక్ట్‌లు ఉంటాయి. ఒక్కో విభాగం నుంచి 30 ప్రశ్నలు చొప్పున మొత్తం 150ప్రశ్నలు అడుగుతారు.ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.లాంగ్వేజ్–1 సబ్జెక్ట్ కింద తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠి, తమిళం, గుజరాతీ లాంగ్వేజ్‌లను ఎంచుకోవచ్చు.
UPSC: యూపీఎస్సీ కొత్త చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నది ఈమెనే...
పేపర్–2ఎ
➨ ఈ పేపర్‌లో నాలుగు విభాగాలు (చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజి 30 ప్రశ్నలు– 30 మార్కులు); లాంగ్వేజ్–1 (30 ప్రశ్నలు–30 మార్కులు); లాంగ్వేజ్–2 ఇంగ్లిష్ (30 ప్రశ్నలు–30 మార్కులు); సంబంధిత సబ్జెక్ట్ (60 ప్రశ్నలు–60 మార్కులు)గా పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 150 ప్రశ్నలు–150 మార్కులకు పరీక్ష ఉంటుంది.
➨ సబ్జెక్ట్ విభాగానికి సంబంధించి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్ అభ్యర్థులు మ్యాథ్స్ అండ్ సైన్స్ విభాగాన్ని, సోషల్ టీచర్లు సోషల్ స్టడీస్ విభాగాన్ని, లాంగ్వేజ్ టీచర్లు సంబంధిత లాంగ్వేజ్‌ను ఎంచుకుని పరీక్ష రాయాలి. అదే విధంగా సబ్జెక్ట్ పేపర్‌లో మ్యాథమెటిక్స్‌లో.. 24 కంటెంట్– 6 పెడగాజి ప్రశ్నలు ఉంటాయి.
సైన్స్ సబ్జెక్ట్‌లో.. ఫిజికల్ సైన్స్ నుంచి 12 ప్రశ్నలు, బయలాజికల్ సైన్స్ నుంచి 12 ప్రశ్నలు చొప్పున కంటెంట్ సంబంధిత ప్రశ్నలు ఉంటాయి. మిగతా 3 ప్రశ్నలు సైన్స్ పెడగాజి నుంచి ఉంటాయి. సోషల్ విభాగంలో 48 కంటెంట్ ప్రశ్నలు–12 పెడగాజి ప్రశ్నలు అడుగుతారు. లాంగ్వేజ్ సబ్జెక్ట్ మెథడాలజీకి సంబంధించి 48 కంటెంట్–12 పెడగాజి ప్రశ్నలు ఉంటాయి.
NEET UG AP State Ranks 2024 : ఏపీలో నీట్ యూజీ-2024 రాష్ట్రస్థాయి ర్యాంక్‌ల విడుదల తేదీ ఇదే.. ఇక ఆగస్టు తొలివారంలోనే..
పేపర్–2బి
➨ పేపర్–2బిని కూడా పేపర్–2ఎ మాదిరిగా నాలుగు విభాగాల్లో నిర్వహిస్తారు. మొదటి మూడు విభాగాలు పేపర్–2ఎలోవే ఉంటాయి. నాలుగో విభాగంగా మాత్రం డిజేబిలిటీ స్పెషలైజేషన్ సబ్జెక్ట్ అండ్ పెడగాజి ఉంటుంది. ఈ విభాగంలో 60 మార్కులకు 60 ప్రశ్నలతో పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం నాలుగు విభాగాలు కలిపి 150 ప్రశ్నలతో 150 మార్కులకు పరీక్ష ఉంటుంది.
➨ నాలుగో విభాగంలో అభ్యర్థులు తాము స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులో చదివిన సబ్జెక్ట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ సబ్జెక్ట్ నుంచి 48 కంటెంట్, 12 పెడగాజి ప్రశ్నలు అడుగుతారు.
టెట్ పరీక్షలో రాణించేలా
చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజి
శిశువు మనస్తత్వం సంబంధిత అంశాలపై దృష్టి పెట్టాలి. వికాస దశలు, వికాస అంశాలైన శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలు;శిశువు ప్రవర్తనలో మార్పునకు సంబంధించిన అభ్యాసం, అభ్యసన బదలాయింపు; ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్, శిశువు విద్యా ప్రణాళిక, బోధన పద్ధతులు, మూల్యాంకనం– నాయకత్వం–గైడెన్స్–కౌన్సెలింగ్ గురించి అధ్యయనం చేయాలి.
‘Agnipath’ను యువత వినియోగించుకోవాలి
లాంగ్వేజ్
లాంగ్వేజ్–1లో అభ్యర్థులు తాము ఎంచుకున్న భాషలో.. అదే విధంగా లాంగ్వేజ్–2గా పేర్కొన్న ఇంగ్లిష్‌లో భాషా విభాగాలకు సంబంధించిన సాధారణ వ్యాకరణ అంశాలు, బోధన పద్ధతులపై ప్రశ్నలు ఉంటాయి. స్కూల్ స్థాయిలో తెలుగు సబ్జెక్ట్ పుస్తకాలతోపాటు తెలుగు బోధన పద్ధతులను చదవాలి. ఇంగ్లిష్‌లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, డైరెక్ట్ అండ్ ఇన్ డైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపేరిజన్, వొకాబ్యులరీ.. ఇలా అన్ని అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి.
మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్
సబ్జెక్టుల్లో ప్రాథమిక అంశాలపై ఒకటి నుంచి నుంచి అయిదో తరగతి వరకు; ఎన్విరాన్‌మెంటల్ పేపర్‌లో సైన్స్, సమకాలీన అంశాలపైనా దృష్టి పెట్టాలి.
➨ సైన్స్: ఎనిమిదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలు ఔపోసన పట్టాలి. పేపర్–2 కోసం ప్రత్యేకంగా ఆరు నుంచి పదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలను అధ్యయనం చేయాలి. అదే విధంగా ఆయా అంశాల బేసిక్స్, అప్లికేషన్స్ వంటి వాటిపై దృష్టిపెట్టాలి.
➨ సోషల్ స్టడీస్: హైస్కూల్ స్థాయి పాఠ్య పుస్తకాలను అధ్యయనం చేయాలి. అదే విధంగా ఒక అంశానికి సంబంధించి అన్ని కోణాల్లోనూ చదవాలి.
➨ మెథడాలజీ: ఈ విభాగంలో ప్రధానంగా బోధనా పద్ధతులు; టీచర్ లెర్నింగ్ మెటీరియల్(టీఎల్‌ఎం); బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలను చదవాలి.
Apprentice Posts : హెవీ వెహికల్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ పోస్టులు.. వివరాలు!
టెట్‌తోపాటే డీఎస్సీకి ప్రిపరేషన్
➨ టెట్‌తోపాటు డీఎస్సీకి సమాంతర ప్రిపరేషన్ సాగించడం మేలు. అందుకోసం ఎస్‌జీటీ అభ్యర్థులు జీకే, కరెంట్ అఫైర్స్ సిలబస్‌పై పూర్తిస్థాయి అవగాహన పెంచుకోవాలి. భౌగోళిక నామాలు, నదీతీర నగరాలు, దేశాలు–రాజధానులు, ప్రపంచంలో తొలి సంఘటనలు, అవార్డులు, సదస్సులు, వార్తల్లో వ్యక్తులు, బడ్జెట్, అంతర్జాతీయ రాజకీయ అంశాలు, శాస్త్రసాంకేతిక అంశాలు తెలుసుకోవాలి.
➨ అదే విధంగా విద్యా దృక్పథాలు; విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంపై పూర్తి అవగాహన పొందాలి. కంటెంట్‌కు సంబంధించి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను అధ్యయనం చేయాలి.
ఏపీ టెట్ ముఖ్య తేదీలు
➨ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024, ఆగస్ట్ 3
➨ హాల్ టికెట్ డౌన్‌లోడ్: 2024, సెప్టెంబ్ 22 నుంచి
➨ టెట్ తేదీలు: 2024, అక్టోబర్ 3 నుంచి 20 వరకు
➨ పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://aptet.apcfss.in
Tags
- TET notification
- AP TET 2024 Notification
- Teacher Eligibility Test
- Teacher jobs
- entrance exam for teacher jobs
- online applications
- preparation method for tet
- tet 2024 preparation tips
- tet 2024 hall ticket download
- tet exam 2024 dates
- AP TET Exam Pattern 2024
- Teachers
- ap tet notification 2024
- dsc eligibles
- DSC Exam 2024
- ap tet and dsc exams
- AP TET 2024 Dates
- Education News
- Sakshi Education News
- AndhraPradeshTET
- APTET2024
- TETApplication
- AP TET Eligibility
- TET Score Validity
- DSCExams
- TETProcedure
- aptetsyllabus
- TETPreparation
- TETExamPattern
- sakshieducation latest notifications