Intermediate Rankers: విద్యార్థుల ప్రతిభకు ప్రిన్సిపాల్‌ అభినందనలు..

ఇంటర్‌ ప్రథమ ద్వితియ సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల గురించి తెలిపారు జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ వెంకటరెడ్డి..

మదనపల్లె: ఇంటర్మీడియట్‌ బోర్డు విడుదల చేసిన ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాల్లో సిద్ధార్థ జూనియర్‌ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ ఇ.వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో దేదీప్యసాయి 470 కి 467 మార్కులు సాధించి రాష్ట్రంలోనే ఫస్ట్‌ ర్యాంకు సాధించిందన్నారు.

Inter 1st Year Students: పరీక్షలో సత్తా చాటిన ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులు వీరే..

అలాగే ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో లహరి ఎంపీసీఎస్‌ విభాగంలో.. 1000 కి 987 మార్కులు సాధించి టౌన్‌ఫస్ట్‌గా నిలిచిందన్నారు. బైపీసీ ప్రథమ సంవత్సరంలో 440 కి 432 మార్కులు సాధించి రోహిణి సుహైలా ఉత్తమ ప్రతిభ కనపరిచిందన్నారు. కళాశాల డైరెక్టర్‌ హేమంత్‌కుమార్‌, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

AP Inter Results 2024: ఏపీ ఇంటర్‌ ఫలితాల్లో అమ్మాయిలదే హవా,ఒకేషనల్‌లోనూ బాలికలదే పైచేయి..  

#Tags