Gurukul Inter Admissions: అంబేడ్క‌ర్ గురుకులంలో ఇంట‌ర్మీడియ‌ట్ ప్ర‌వేశానికి ప‌రీక్ష‌..

2024–25 విద్యా సంవత్సరానికి జూనియర్‌ ఇంటర్మీడియట్‌లో చేరేందుకు ప్ర‌వేశ ప‌రీక్ష నిర్వ‌హిస్తారు..

కాకినాడ: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి జూనియర్‌ ఇంటర్మీడియట్‌లో చేరే విద్యార్థులకు మొదటి జాబితా సీట్లను ఆన్‌లైన్‌ కౌన్సిలింగ్‌ ద్వారా కేటాయించామని జిల్లా సమన్వయాధికారి జి.వెంకటరావు తెలిపారు. మిగిలిన సీట్లను ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులతో మెరిట్‌ లిస్ట్‌ ప్రకారం భర్తీ చేస్తామన్నారు. ద్రాక్షారామం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలో గురువారం బాలురకు, కాకినాడ సాంబమూర్తి నగర్‌లోని అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలో శుక్రవారం బాలికలకు కేటాయించనున్నట్లు తెలిపారు.

Girls Gurukul Admissions: బాలిక‌ల గురుకులంలో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు.. చివ‌రి తేదీ!

ఈ కౌన్సెలింగ్‌ ఉదయం 10 గంటల నుంచి జరుగుతుందన్నారు. ఆయా విద్యార్థుల మొబైల్‌ నంబర్లకు ఇప్పటికే సమాచారం అందజేసినట్టు తెలిపారు. విద్యార్థులు తమ ఆధార్‌ కార్డు, పదో తరగతి మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలన్నారు. ఇతర సమాచారం కోసం జి.దేవి 63040,97747, వి.ప్రసాద్‌బాబు 94404 99016 నంబర్లను సంప్రదించాలన్నారు.

Free Textile Diploma Course: హ్యాండ్లూమ్స్ టెక్స్ టైల్ డిప్లొమా కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం.. నెలకు స్టైఫండ్ ఇంత‌!

#Tags