Junior College Admissions 2024: శ్రీవేంకటేశ్వర జూనియర్‌ కళాశాలల్లో నూత‌న విద్యా సంవ‌త్స‌రంలో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

టెన్త్‌లో పూర్తి చేసుకున్న విద్యార్థులు జూనియ‌ర్ క‌ళాశాల‌లో చేరేందుకు ద‌ర‌ఖాస్తుల‌కు ఆహ్వానిస్తోంది ఈ జూనియ‌ర్ క‌ళాశాల‌. అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న విద్యార్థులు ప్ర‌క‌టించిన విధంగా ద‌ర‌ఖాస్తులు చేసుకోవాలి..

తిరుపతి: తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్‌ కళాశాల, శ్రీవేంకటేశ్వర జూనియర్‌ కళాశాలల్లో 2024 – 25 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టీటీడీ విద్యాశాఖాధికారి డాక్టర్‌ భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఈనెల 15 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం యూజర్‌ మాన్యువల్‌, ఆయా కళాశాలల ప్రాస్పెక్టస్‌ను తెలుగు, ఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు. విద్యార్థులు admission.tirumala.org వెబ్‌ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

TS EAPCET 2024: ఎంసెట్‌లో ఆ ర్యాంకు వస్తే CSE సీటు ఈజీనే..

#Tags