Free DSC Coaching: ఉచితంగా డీఎస్సీ శిక్షణ.. కావల్సిన అర్హతలివే!

రాయచోటి టౌన్‌: డీఎస్సీకి (సెకండ్‌గ్రేడ్‌ టీచర్స్‌) ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నామని అన్నమయ్య జిల్లా ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ డైరెక్టర్‌ సందప్ప శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

టెట్‌ క్వాలిఫై అయిన అభ్యర్థులకు 200 మందికి రాయచోటిలో ఉచిత శిక్షణ నిర్వహిస్తామని తెలిపారు. అన్నమయ్య జిల్లాకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు సంవత్సర ఆదాయం రూ.1లక్ష లోపు ఉండేవారు శిక్షణకు అర్హులన్నారు. శిక్షణ కాలం 60 రోజులు ఉంటుందని చెప్పారు.

Nissan Company Layoffs: ఉద్యోగులకు షాక్‌.. 9000 మందిని తొలగించనన్న నిస్సాన్‌ కంపెనీ..

అర్హులైన అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, టీటీసీ మార్కులిస్టులతో పాటు కుల, ఆదాయ, ఆధార్‌ కార్డులతో పాటు రెండు పాస్‌ పోర్టు సైజ్‌ ఫోటోలు జత పరిచి రాజంపేట రోడ్డులోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయ సముదాయాలలోని రూం నంబర్‌–5, బ్లాక్‌ నంబర్‌–1లో ఈ నెల 12వ తేదీ లోగా దరఖాస్తులు అందజేయాలని కోరారు. వివరాల కోసం 94940 75135, 99124 45108, 99890 39216లలో సంప్రదించాలని సూచించారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

#Tags