Skip to main content

Free coaching Group Exams: గ్రూప్స్‌ పరీక్షలకు, RRB, SSC, బ్యాంకింగ్‌ ఉద్యోగ పోటీ పరీక్షలకు నాలుగు నెలలపాటు ఉచితంగా శిక్షణ

Free coaching  Career counseling session for minority youth in Mahabubnagar, Telangana
Free coaching

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: మైనార్టీ విద్యావంతులైన యువతకు తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్‌, కెరీర్‌ కౌన్సిలింగ్‌ సెంటర్‌ తరపున నాలుగు నెలల ఉచిత ఫౌండేషన్‌ కోర్సు కింద కోచింగ్‌ ప్రారంభించనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి శంకరాచారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు దరఖాస్తు తేదీని వచ్చేనెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు.

డిగ్రీ అర్హతతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఉద్యోగాలు: Click Here

గ్రూప్‌–1, 2, 3, 4, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ, బ్యాంకింగ్‌తోపాటు భవిష్యత్‌లో జరిగే ఇతర ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధం చేసేందుకు కోచింగ్‌ ఉంటుందన్నారు. మైనార్టీ యువత దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన మైనార్టీ యువత అవసరమైన సర్టిఫికెట్లు, దరఖాస్తును వచ్చేనెల 15 వరకు ఐడీఓసీలోని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని కోరారు. వివరాలకు 9440970730 సంప్రదించాలని ఆయన సూచించారు.

ముఖ్య సమాచారం:
ట్రైనింగ్‌ ఫీజు: ఉచితం

దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 15 వరకు

వివరాలకు: 9440970730 సంప్రదించండి

Published date : 13 Jan 2025 10:42AM

Photo Stories