School Education Department: బడికి రప్పించేలా రవాణా చార్జీలు

బడి వయసు పిల్లలెవరూ చదువులకు దూరం కాకుండా స్కూళ్లలో చేరేలా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది.
బడికి రప్పించేలా రవాణా చార్జీలు

అమ్మ ఒడి కింద ఏటా రూ.15వేల చొప్పున మూడేళ్లుగా రూ.19,617 కోట్లను నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన సంగతి తెలిసిందే. స్కూళ్లకు వచ్చే విద్యార్థులకు జగనన్న గోరుముద్ద ద్వారా నాణ్యమైన, బలవర్థకమైన ఆహారాన్ని అందిస్తున్నారు. జగనన్న విద్యాకానుక ద్వారా రూ.2,324 కోట్లతో కుట్టుకూలీతో 3 జతల యూనిఫారం దుస్తులు, బ్యాగు, బెల్టు, షూ, సాక్సులు, పాఠ్యపుస్తకాలు, నోట్సులు, వర్కుబుక్కులు, డిక్షనరీతో కూడిన స్టూడెంట్‌ కిట్లు అందిస్తున్నారు.

చదవండి: Badi Bata Programme: 26 జిల్లాల్లో తిరిగి బడి బాట పట్టించిన పిల్లల సంఖ్య ఇలా..

వీటన్నిటితోపాటు స్కూళ్లు అందుబాటులో లేనివారికి, దూర ప్రాంతాల్లో నివసించే పిల్లలు నడవాల్సిన అవసరం లేకుండా రవాణా చార్జీలను సైతం ప్రభుత్వం చెల్లిస్తోంది. ట్రాన్స్‌పోర్ట్‌ చార్జీల కింద నెలకు రూ.600 చొప్పున 10 నెలల పాటు అందిస్తోంది. 2022–23కిగాను 40 వేల మందికిపైగా రవాణా చార్జీల కింద రూ.24.25 కోట్లు చెల్లించనున్నారు.

చదవండి: School Education Department: పాఠశాలల పనివేళల్లో ఈ ప్రచారం వద్దు

#Tags