SSC Hall Tickets 2024 : 10వ తరగతి హాల్‌టికెట్స్‌ విడుదల, ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి..డైరెక్ట్‌ లింక్‌

పదో తరగతి పరీక్షల హాల్‌టికెట్స్‌ను విద్యాశాఖ విడుదల చేసింది.అధికారిక వెబ్‌సైట్‌ https://www.bse.ap.gov.in/ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచారు. పాఠశాలల లాగిన్ తో పాటు విద్యార్థులు కూడా నేరుగా హాల్ టికెట్లను నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.  మార్చి 18 నుంచి  30వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.

Download AP 10th Class Model Papers TM EM

ఇప్పటికే పరీక్షల షెడ్యూల్‌ను బోర్డు విడుదల చేసింది. ఈ ఏడాది 6,23,092 మంది పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 3,17,939 మంది బాలురు కాగా, 3,05,153 మంది బాలికలున్నారు. పదో తరగతి పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 3,473 సెంటర్లను సిద్ధం చేశారు. ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షను నిర్వహిస్తారు.
 
AP SSC Hall Tickets 2024 ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు:

  • మొదట అధికారిక వెబ్‌సైట్‌ https://www.bse.ap.gov.in/ ను క్లిక్‌ చేయండి
  • మెయిన్ పేజీలో AP SSC Hall Tickets 2024 డౌన్‌లోడ్ లింక్‌ పై క్లిక్ చేయండి
  • మీ వివరాలు నమోదు చేసి, సబ్మిట్ బటన్‌ను క్లిక్‌ చేయండి
  • తర్వాతి పేజీలో పదో తరగతి హాల్ టికెట్‌ కనిపిస్తుంది
  • హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని.. ప్రింటవుట్ తీసుకోవచ్చు


పదో తరగతి పరీక్షల షెడ్యూల్

  • మార్చి 18 - ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్‌-1
  • మార్చి 19 - సెకండ్ లాంగ్వేజ్
  • మార్చి 21 - ఇంగ్లీష్‌
  • మార్చి 23 - గణితం
  • మార్చి 26 - ఫిజిక్స్
  • మార్చి 28 - బయాలజీ
  • మార్చి 30 - సోషల్ స్టడీస్

#Tags