Selfie with Toppers: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో 'సెల్ఫీ విత్ టాపర్స్'

ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలల కంటే మెరుగ్గా నిర్వహించాలన్న ఆశయం దిశగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో 'సెల్ఫీ విత్ టాపర్స్'

 ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలలో టాపర్లుగా నిలిచిన విద్యార్థుల మరింత చైతన్య పరిచేందుకు 'సెల్ఫీ విత్ టాపర్స్' కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తయిన ఫార్మేటివ్ అసెస్మెంట్ -2  పరీక్షల ఫలితాల్లో తరగతి వారీగా టాపర్లుగా నిలిచిన విద్యార్థులతో సెల్ఫీలు తీసుకుని సామాజిక మాధ్యమాల్లో ప్రచురించే కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాశ్ ప్రభుత్వ ఉపాధ్యాయులను ఆదేశించారు. సబ్జెక్టు టీచర్లు వెంటనే పరీక్షల మూల్యాంకనం పూర్తి చేసి అక్టోబర్ 7 నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు.  

చదవండి: Rathore Sindhu & Ankita: ప్రతిభను కనబరిచి.. పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాల్లో గెలిచి..

జిల్లా కలెక్టర్ మరియు ఇతర జిల్లా ఉన్నతాధికారులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. 

'సెల్ఫీ విత్ టాపర్స్' ద్వారా విద్యార్థులలో బాగా చదివి మంచి మార్కులు సాధించాలనే పోటీతత్వం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ముఖ్యమైన ప్రశ్నలు | బిట్ బ్యాంక్ | సిలబస్ | వియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్

#Tags