Tenth Public Exam Fees : పబ్లిక్ పరీక్షల ఫీజు చల్లింపుకు షెడ్యూల్ విడుదల.. ఈ తేదీలోగా!
అమరావతి: వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదలైంది. 2024–25లో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 28 నుంచి వచ్చేనెల 11 వరకు ఫీజు చెల్లించాలని ఎస్‌ఎస్‌సీ బోర్డు పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
Agniveer Army Recruitment Rally: అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ అర్హతలు ఇవే..
ప్రధానోపాధ్యాయులు ఆన్‌లైన్ నామినల్ రోల్స్‌ను సైతం ఈ తేదీల్లోనే సమర్పించాలని సూచించారు. రూ.50 ఆలస్య రుసుంతో నవంబర్ 18 వరకు, రూ.200 ఆలస్య రుసుంతో 25 వరకు, రూ.500 లేట్ ఫీజుతో నవంబర్ 30 వరకు చెల్లించవచ్చని తెలిపారు. ఫీజును https://www.bse.ap.gov.in/ లో స్కూల్ లాగిన్‌లో చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags