Jagananna Amma Vodi: అమ్మఒడి.. భవితకు పెట్టుబడి

చదువుకు పేదరికం అడ్డురాకూడదు. ప్రతితల్లీ తమ బిడ్డలను చదివించాలనే సంకల్పంతో అమ్మఒడి పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్నారు. పుట్టిన బిడ్డకు వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ నుంచి విద్యార్థి దశ వరకు వివిధ రూపాల్లో లబ్ధి చేకూర్చుతున్నారు. పేదింటి పిల్లలను వెన్నుతట్టి నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు.

వరదయ్యపాళెం: భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ అమల్లో లేని అమ్మఒడి పథకంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సత్యవేడు నియోజకవర్గంలోని 7 మండలాల్లో 27,794 కుటుంబాలకు అమ్మఒడి నిధులు మంజూరయ్యాయి. అమ్మఒడి నగదును నేరుగా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన నాలుగు విడతల్లో రూ.120 కోట్ల మేర తల్లుల ఖాతాల్లోకి జమ అయింది.

చదవండి: Andhra Pradesh: విద్యా వ్యవస్థకు పెద్ద పీట

ఆర్థిక భరోసా

గతంలో పేద కుటుంబాల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించాలంటే ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు. ఇలాంటి సమయంలో అమ్మఒడి ఆయా కుటుంబాలకు కొండంత భరోసాన్నిచ్చింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాలకు ఏడాదికి రూ.13 వేల చొప్పున జమ చేస్తున్నారు.

  • లబ్ధిదారుల కుటుంబాల్లో వెల్లివిరిసిన సంతోషం
  • వరుసగా 4 విడతలు అమ్మఒడి నిధులు జమ
  • సత్యవేడు నియోజకవర్గంలో 27,794 మందికి లబ్ధి

తల్లులకు ఆసరా
పేదరికంలో మగ్గుతున్న పిల్లల తల్లులకు అమ్మఒడి ఆసరాగా నిలుస్తోంది. కూలి పనులు చేసుకుని బిడ్డలను చదివించుకోలేక మధ్యలోనే చదువు మాన్పించేవాళ్లం. అలాంటి వారి కోసం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం అండగా నిలుస్తోంది. గడిచిన నాలుగేళ్లు పథకం వర్తించింది. చిరకాలం ఆయనే సీఎంగా ఉండాలి.
–కే.సుహాసిని, ఎంజీనగర్‌

అద్భుతమైన పథకం
అమ్మఒడి వంటి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని కలలో కూడా ఊహించలేదు. మాకు ఒక పాప ఉంది. నాకు కూడా ఈ పథకం వర్తించింది. గడిచిన నాలుగు విడతలుగా నగదు అందుకున్నాను. గతంలో ఏ ముఖ్యమంత్రికి రాని సరికొత్త ఆలోచన ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి వచ్చినందుకు సంతోషంగా ఉంది.
–సుమతి, వరదయ్యపాళెం మండలం

చదువు భారం కాకూడదనే
నాకు ఇద్దరు పిల్లలు. ఒకరు 6, మరొకడు 10వ తరగతి చదువుతున్నారు. వీరిని చదివించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లం. ప్రస్తుతం సీఎం జగనన్న ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం మాకు ఎంతో ఊరటనిచ్చింది. మా లాంటి పేదలకు పిల్లల చదువు భారం కాకూడదనే సీఎం జగనన్న ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లుంది.

–మీన, పెద్దవీధి, పిచ్చాటూరు

రుణపడి ఉంటాం
పేద విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆగిపోకుండా ఉండేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మొదటి విడతలో రూ.15వేలు, రెండో విడతలో రూ.14వేలు, 3, 4 విడతల్లో రూ.13వేలు చొప్పున అందుకున్నా. నా ఇద్దరు పిల్లలను ఈ పథకం ద్వారా ఉన్నత చదువులు చదివించుకుంటున్నా. సీఎం జగనన్నకు రుణపడి ఉంటాం.

–వనమ్మ, తొండంబట్టు

సత్యవేడు నియోజకవర్గంలో జగనన్న అమ్మఒడి వివరాలు

మండలం

లబ్ధిదారుల సంఖ్య

కేవీబీపురం

4,945

వరదయ్యపాళెం

 5,488

నారాయణవనం

 3,888

నాగలాపురం

3,342

పిచ్చాటూరు

2,323

సత్యవేడు

4,542

బుచ్చినాయుడుకండ్రిగ

3,266


పేద బిడ్డలకు మంచి రోజులు
రాష్ట్రానికి సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి వచ్చాక మాకు, మా పిల్లల భవిష్యత్‌పై నమ్మకం పెరిగింది. బడికి పంపితే ఏటా రూ.13 వేలు ఇవ్వడం పేదోళ్లకు ఒక వరమే. పేదోల పిల్లలకు కూడా కార్పొరేట్‌ విద్యార్థులులాగా హుందాగా పోతున్నారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రావడంతో నా కష్టమంతా తీరింది. నా కొడుకు చదువు భారాన్ని సీఎం జగనన్నే చుసుకోవడం ఆనందంగా ఉంది
–అమరావతి, తిరువట్యం, నారాయణవనం మండలం

#Tags