Andhra Pradesh: విద్యా వ్యవస్థకు పెద్ద పీట
జగనన్న ప్రభుత్వం విద్యా వ్యవస్థకు పెద్దపీట వేసింది. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు చాలా అభివృద్ధి చెందాయి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక విద్యార్థులకు జగనన్న విద్యాకానుకలో భాగంగా నోట్‌పుస్తకాలు, యూనిఫాం, బ్యాగు, బూట్లు, టై, బెల్టు, డిక్షనరీ, జగనన్న గోరుముద్ద వంటి పథకాలు ప్రవేశపెట్టారు. దీంతో ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. అమ్మఒడి పథకం ద్వారా పేద , బడుగు, బలహీన వర్గాల వారికి మంచి జరిగింది. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం మరింత శుభ పరిణామం.
–యామవరం రామకేశవ, ఎంపీయూపీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు, వెంకటేశ్వరపురం, సిద్దవటం మండలం
నెరవేరిన సొంతింటి కల
గతంలో మాకు సొంత ఇల్లు లేకపోవడంతో అ ద్దె ఇంట్లో ఉండేవాళ్లం. అద్దె కట్టేందుకు నానా ఇ బ్బందులు పడేవాళ్లం. వైఎస్సార్‌సీపీ ప్ర భుత్వం వచ్చాక ఇంటి స్థలంతో పాటు ఇల్లు మంజూరైంది. సొంతింటి నిర్మాణ పనులు చేసుకుంటున్నాము.
–ఎస్.ఫరీదా, ములకలచెరువు
సులభంగా సర్టిఫికెట్ అందించారు
గతంలో ఏదైనా సర్టిఫికెట్ కావాలంటే అర్జీ పెట్టుకునేందుకు నానా కష్టాలు పడేవాళ్లం. సర్టిఫికెట్ చేతికందాలంటే కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అయితే జగనన్న సురక్ష కార్యక్రమంలో నాకు అవసరమైన కుల ధ్రువీకరణ పత్రం ఒక్కరోజులోనే అందించారు. ఇలాంటి సేవలందిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటాం.
– వి. రమణమ్మ, బండ్లవంక, పీలేరు