Inspire Manak 2023: ఇన్‌స్పైర్‌ మానక్‌ శిక్షణ తరగతులు

నరసరావుపేట ఈస్ట్‌: పల్నాడు జిల్లా పరిధిలోని అన్ని యాజమాన్యాలలో పనిచేసే పాఠశాలల గైడ్‌ టీచర్లకు ఇన్‌స్పైర్‌ మానక్‌–23 శిక్షణా తరగతులను ఆగ‌ష్టు 3వ తేదీ గురువారం లింగంగుంట్ల శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్‌లో నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి కె.శామ్యూల్‌ ఆగ‌ష్టు 1న‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇన్‌స్పైర్‌ మానక్‌ శిక్షణ తరగతులు

 జిల్లా పరిధిలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల నుంచి ఒక సైన్స్‌ గైడ్‌ టీచర్‌ తప్పనిసరిగా హాజరు కావాలని తెలిపారు. ఇన్‌స్పైర్‌ మానక్‌–23 నామినేషన్లు, యూజర్‌ ఐడి, మెయిల్‌ అడ్రస్‌, ఫోన్‌ నెంబర్‌ మార్పు తదితర అంశాలపై శిక్షణ ఉంటుందని వివరించారు.

జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌, ప్రాజెక్ట్‌ల రూపకల్పన, పర్యావరణ పరిరక్షణ అంశాలపై శిక్షణ ఉంటుందన్నారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయుడిని తరగతులకు పంపాలని తెలిపారు.

చదవండి:

No School Teachers: విద్యార్థులకు ‘పరీక్ష’

School Students: ఉపాధ్యాయుల కొరత తీర్చాలని ఆందోళన

Age limit: అధ్యాపకుల వయోపరిమితిని 65 ఏళ్లకు పెంపు..

#Tags