School Education Department: విద్యార్థులను చేర్చుకోవడంలో అలసత్వం వద్దు

సాక్షి, అమరావతి: పాఠశాలల్లో విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేయడం, ఇతర పాఠశాలలకు బదిలీ చేయడం వంటి ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేశ్‌కుమార్‌ ఆదేశించారు.

రికార్డ్‌ షీట్, టీసీ, కుల ధ్రువీకరణ పత్రం, జనన ధ్రువీకరణ పత్రం, ఇతర సర్టిఫికెట్ల  కోసం పట్టుబట్టకుండా పాఠశాలల్లో ప్రవేశం కల్పించాలని ఆర్జేడీలు, డీఈవోలకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఇకపై విద్యార్థుల బదిలీలు ఆన్‌లైన్‌ ప్రక్రియ ద్వారానే జరుగుతాయని, అందుకు ఎలాంటి పత్రాలు అవసరం లేదన్నారు.

విద్యార్థిని ఒకటో తరగతిలో చే ర్చుకునేటప్పుడు అన్ని పత్రాలను డిజిటల్‌ రూపంలో ఉంచడంతో పాటు చైల్డ్‌ ఐడీ నమోదుకు ఆధార్‌ నంబర్‌ ఆధారంగా పర్మినెంట్‌ ఎడ్యుకేషన్‌ నంబర్‌ (పెన్‌) వస్తుందన్నారు.  ఒకటో తరగతిలో చేరేటప్పుడే ప్రతి విద్యార్థికి డిజిలాకర్‌ వస్తుందని, అందులోనే అన్ని పత్రాలు ఉంటాయన్నారు. 

చదవండి: Gurukul School Admissions for 5th Students: ఈ రెండు రోజుల్లో గురుకుల ప్రవేశానికి విద్యార్థుల ఎంపిక..

ప్రతి విద్యార్థికీ శాశ్వత విద్యా సంఖ్య (పెన్‌)

 2024–25 విద్యా సంవత్సరం నుంచి ఒకటో తరగతిలో చేరే వారికి మినహా మిగతా విద్యార్థులందరికీ ‘శాశ్వత విద్యా సంఖ్య’ (పెన్‌) ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తులపై పారదర్శకంగా నిర్ణయం తీసుకోవాలి

రాష్ట్రంలోని ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల ప్రా రంభ అనుమతి, గుర్తింపు, గుర్తింపు పునరుద్ధరణపై వచ్చిన ఆన్‌లైన్‌ దరఖాస్తులపై సకాలంలో పారదర్శకంగా నిర్ణయం తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌  ఆర్జేడీలు, డీఈవోలను ఆదేశించారు.

చదవండి: Free Training: స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో ఉపాధి కోర్సుల్లో ప్రవేశాలు.. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత శిక్షణ, భోజనం, వసతి

ఇకపై ఆన్‌లైన్‌ పోర్టల్‌లో దరఖాస్తు స్వీకరించిన తేదీనుంచి ఎంఈవో/డీవైఈవో 30 రోజు ల్లోపు, డీఈవో, ఆర్జేడీ కార్యాలయాల్లో ఏడు రోజు ల్లోపు ప్రతిపాదనలు ప్రాసెస్‌ చేయాలని  ఆదేశించారు. నిర్ణీత గడువులోగా ఏ అధికారైనా చర్యలు తీసుకోవడంలో విఫలమైతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ హెచ్చరించారు.   

#Tags