Tenth Supplementary: ఈనెల 24 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు..
చిత్తూరు: పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు జరుగుతాయని డీఈఓ దేవరాజు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 15 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా, 2006 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు.
JEE Advanced Applications: 11 ఏళ్ల తర్వాత జేఈఈకి అధిక దరఖాస్తుల సంఖ్య.. పరీక్ష విధానం ఇలా!
పరీక్షల పకడ్బందీ నిర్వహణకు చీఫ్, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లను నియమిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఏపీ ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలు జూన్ ఒకటి నుంచి 8వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 9 కేంద్రాలలో 1561 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని డీఈఓ వెల్లడించారు.
TS EAMCET Results 2024: నేడు 11 గంటలకు టీఎస్ ఎంసెట్ ఫలితాలు.. రిజల్స్ కోసం డైరెక్ట్ లింక్స్ ఇవే