Gurukula Colleges Admissions: గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఖాళీ సీట్ల భర్తీ కోసం కౌన్సెలింగ్
సబ్బవరం: ఉమ్మడి విశాఖ జిల్లాలోని బాలుర గురుకుల కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం స్థానిక సబ్బవరం బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో గురువారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని సబ్బవరం, దేవరాపల్లి, గొలుగొండ, శ్రీకృష్ణాపురం గురుకుల కళాశాలల్లో ప్రవేశాల కోసం ఇప్పటికే ప్రవేశ పరీక్ష నిర్వహించి, ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఆన్‌లైన్ విధానం ద్వారా సీట్లు భర్తీ చేశారు.
Also Read: After Inter MPC Best Courses & Job Opportunities
మిగులు సీట్ల కోసం మెరిట్ అధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను అనుసరించి సీట్లు భర్తీ చేసేందుకు ఈ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్‌కు సుమారు 200 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆయా కళాశాలల్లో 188 సీట్లు ఖాళీగా ఉండగా, కౌన్సెలింగ్ ద్వారా 81 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. అడ్మిషన్ కౌన్సెలింగ్ చైర్మన్‌గా ఉమ్మడి జిల్లా గురుకులాల సమన్వయకర్త ఎస్.రూపావతి, సభ్యులుగా ఆయా గురుకులాల ప్రిన్సిపాల్స్ సీహెచ్.వి.వి.సత్యారావు, ఆర్.రామకృష్ణ, సీహెచ్ రవీంద్రనాథ్, వి.రత్నవల్లి వ్యవహరించారు.