Shocking News for Students : విద్యార్థులకు స‌ర్కార్‌ షాక్‌.. ఈ సెల‌వుల్లో భారీ త‌గ్గింపు.. ఇక‌పై..!!

ప్ర‌తీ ఏటా విద్యార్థుల‌కు జ‌న‌వ‌రిలో సంక్రాంతికి ఎక్కువ రోజులు సెల‌వులు ఉంటాయి. ఏపీ అయితే మ‌రింత ఎక్క‌వే ఉంటుంది.

సాక్షి ఎడ్యుకేష‌న్: ప్ర‌తీ ఏటా విద్యార్థుల‌కు జ‌న‌వ‌రిలో సంక్రాంతికి ఎక్కువ రోజులు సెల‌వులు ఉంటాయి. ఏపీ అయితే మ‌రింత ఎక్క‌వే ఉంటుంది. కాని, ఈసారి ఏపీ విద్యార్థులు అక్క‌డి ప్ర‌భుత్వం సెల‌వుల విష‌యంలో వారికి షాక్ ఇచ్చింది. ఏపీ ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ఏటా ప్ర‌క‌టించే సెల‌వుల‌ను ఈసారి భారీగా త‌గ్గించింది అక్క‌డి సర్కార్‌..

Breaking News Schools Holidays : విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. మూడు రోజులు వ‌రుస సెల‌వులు.. కార‌ణం ఇదే..!!

కేవ‌లం ఈ తేదీల్లోనే..

ఏపీలో సంక్రాంతి సెల‌వులంటే అయితే, వారం రోజులు లేదా ప‌ది రోజులు ప్ర‌క‌టించేవారు. కాని, ఈసారి దీనిని భారీగా త‌గ్గించి కేవ‌లం మూడు రోజులు మాత్ర‌మే సెల‌వు అంటూ ప్ర‌క‌టించారు. అంటే, జ‌న‌వ‌రి 13, 14, 15వ తేదీల్లోనే అక్క‌డి విద్యార్థుల‌కు సెల‌వు ఉంటుంది.

School Holiday Today : నేడు అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు

ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ఈ తేదీల్లో సెల‌వులు ఇచ్చి, మిగతా రోజుల్లో అదనపు తరగతులు నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది ఏపీ విద్యాశాఖ. ఇదే కనుక జరిగితే పదోవ తరగతి విద్యార్థులకు ఇక సంక్రాంతి సెలవులు మూడు రోజులు అన్నట్టే.

టెన్త్ బోర్డ్ షెడ్యూల్‌..

ఏపీలో పదో తరగతి పరీక్షలకు సంబంధించిన‌ షెడ్యూల్‌ను ఇటీవ‌లె విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఈ ప‌రీక్ష‌లు వ‌చ్చే ఏడాది, మార్చి 17, 2025న ప్రారంభమై అదేనెల‌ 31వ తేదీన ముగుస్తుందని తెలిపారు. ఈ నేప‌థ్యంలో టెన్త్ విద్యార్థులు ప‌రీక్ష‌ల‌కు మెరుగ్గా ప్రీపేర్ అయ్యేందుకు, ఒత్తిడిని తగ్గించేందుకు రోజు విడిచి రోజు ఉండేలా పరీక్షల షెడ్యూల్ను రూపొందిచార‌న్నారు. దీంతో విద్యార్థులు పరీక్షల్లో ప్రతిభను కనబరచడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags