NIFT Admissions : నిఫ్ట్‌లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌).. దేశవ్యాప్తంగా ఉన్న 18 క్యాంపస్‌లలో అకడమిక్‌ సెషన్‌ 2025–26కు సంబంధించి బ్యాచిలర్, మాస్టర్‌ డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

»    నిఫ్ట్‌ క్యాంపస్‌లు: బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, దమణ్, గాంధీనగర్, హైదరాబాద్, జో«ద్‌పూర్, కాంగ్రా, కన్నూర్, ముంబై, న్యూఢిల్లీ, పాట్నా, పంచకుల, రాయ్‌బరేలి, షిల్లాంగ్, శ్రీనగర్, వారణాసి.
కోర్సుల వివరాలు
»    బ్యాచిలర్‌ ప్రోగ్రామ్‌: నాలుగేళ్ల వ్యవధి. 
»    బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ ప్రోగ్రామ్‌(బీడీఈఎస్‌): ఫ్యాషన్‌ డిజైన్‌/లెదర్‌ డిజైన్‌/యాక్సెసరీ 
డిజైన్‌/టెక్స్‌టైల్‌ డిజైన్‌/నిట్‌వేర్‌ డిజైన్‌/
ఫ్యాషన్‌ కమ్యూనికేషన్‌/ఫ్యాషన్‌ ఇంటీరియర్‌.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

»    మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌: రెండేళ్ల వ్యవధి. మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ ప్రోగ్రామ్‌(ఎండీఈఎస్‌), మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌(ఎంఎఫ్‌ఎం), మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (ఎంఎఫ్‌టెక్‌). పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌(డిజైన్, మేనేజ్‌మెంట్, టెక్నాలజీ).
»    అర్హత: యూజీ ప్రోగ్రామ్‌కు 10+2 పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలి. పీజీ ప్రోగ్రామ్‌కు ఏదైనా డిగ్రీ లేదా బీఎఫ్‌టెక్, బీఈ/బీటెక్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌కు సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
»    వయసు: యూజీకి 24 ఏళ్లు మించకూడదు. పీజీ, పీహెచ్‌డీ కోర్సులకు వయోపరిమితి లేదు.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

ముఖ్యమైన తేదీలు
యూజీ, పీజీ ప్రోగ్రామ్‌
»    ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 06.01.2025.
»    దరఖాస్తుల సవరణ తేది: 10.01.2025 నుంచి 12.01.2025 వరకు.
»    అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ తేది: జనవరి మూడో వారం 2025.
»    డిగ్రీ, పీజీ ప్రవేశ పరీక్ష తేది: 09.02.2024.
»    సిట్యుయేషన్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ/డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌: ఏప్రిల్, 2025.
»    వెబ్‌సైట్‌: www.nift.ac.in/admission

PG Spot Admissions : అంబేడ్క‌ర్ వ‌ర్సిటీలో పీజీ స్పాట్ అడ్మిష‌న్లు.. ల‌భించిన స్పంద‌న మాత్రం..

#Tags